
ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్ : మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుని సిబిఐ అధికారుల అరెస్టు చేయడంతో, సమాచారం తెలుసుకున్న తాడేపల్లి మండల తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ, తెలుగుదేశం తాడేపల్లి మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున శనివారం ఎంటీఎంసీ పరిధిలోని కుంచనపల్లి లోని తెలుగుదేశం కార్యాలయం వద్దకు చేరుకున్నారు. తెలుగుదేశం తాడేపల్లి మండల అధ్యక్షులు అమరా సుబ్బారావు ఆధ్వర్యంలో అక్రమ అరెస్టును ఖండించాలి అంటూ జాతీయ రహదారి వద్దకు ర్యాలీగా వెళ్లారు. కుంచనపల్లి జాతీయ రహదారి వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హౌరెత్తించారు. రోడ్డుపై బైఠాయించి, నిరసన తెలిపారు. అనంతరం జాతీయ రహదారిపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. సమాచారం తెలుసుకున్న తాడేపల్లి పోలీస్ అధికారులు తెలుగుదేశం తాడేపల్లి మండల నాయకులు, కార్యకర్తలను దుగ్గిరాల పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో తెలుగుదేశం తాడేపల్లి మండల అధ్యక్షులు అమరా సుబ్బారావు, టిడిపి ఎస్సీ సెల్ నాయకులు దొప్పలపూడి జ్యోతి బస్, టిడిపి గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి పఠాన్ కాసింఖాన్, కాట్రగడ్డ మధుసూదనరావు, నాయకులు వీరి శెట్టి శ్రీనివాసరావు, గాదె శ్రీనివాసరావు, పఠాన్ జానీ ఖాన్, అక్కినేని సుబ్రహ్మణ్యం, దాసరి కఅష్ణ, కూనప రెడ్డి రమేష్,కామినేని సాంబశివరావు, చావలి సురేష్, వంగూరు బీముడు, కాట్రగడ్డ నాగేశ్వరరావు, బొబ్బ రవితేజ, సనాక బుజ్జి, తదితరులున్నారు.