
పాలకొల్లు :ఓటర్ల జాబితాహొఇంటింటా పరిశీలన కార్యక్రమం వేగ వంతంగా జరగాలని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. గురువారం పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల గ్రామ సచివాలయంను జిల్లా కలెక్టరు అకస్మిక తనిఖీ చేశారు. డోర్ టు డోర్ సర్వే ఎన్ని ఇండ్లు పూర్తి అయ్యాయి, ఇంకా ఎన్ని ఇండ్లు మిగిలి ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. మరణించిన వారి ఓట్లు డిలీట్ చేశారా లేదా అని ఆమె పరిశీలించారు. కొత్తగా ఎన్ని ఓట్లు నమోదయ్యాయి, చేర్పులు, మార్పులు వారి వివరాలు అడిగి తెలుసు కున్నారు. రిజిస్టర్లను , కంప్యూటరు డేటాను జిల్లా కలెక్టరు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణకు సంబంధించి డోరు టు డోరు వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు తప్పనిసరిగా బి యల్‌ఓ లు బిఎల్‌ఎలను వెంట తీసుకుని వెళ్లాలని ఆమె తెలిపారు. బియల్వోలు వెంట వాలంటీర్స్ గాని మరి ఏ ఇతరులను గాని తీసుకెళ్లరాదని ఆమె స్పష్టం చేశారు. ఫారం 6,7,8 పై పూర్తి అవగాహన కల్గి ఉండాలని, ప్రతిదానికి తప్పనిసరిగా డాక్యు మెంటు పేపర్స్ బియల్వో దగ్గర ఎప్పుడు రెడీగా ఉండాలన్నారు. ఒకే డోరు నెంబర్లులో 10 మంది ఓట్లు ఉంటే మళ్లీ ఒకసారి వెరిఫికేషన్ చేయాలని ఆమె ఆదేశించారు. ఓటరు జాబితా సవరణకు సంబంధించి ఏఈఆర్వోలు తహశీ ల్దార్లతో సమావేశం నిర్వహించాలని ఆమె ఆదేశించారు. చనిపోయిన ఓటర్లను, వివాహం అయ్యిన ఓటర్ల ను ఫారం 7 ద్వారా తొలిగించా లన్నారు. బిఎల్‌ఓల రిజిస్టర్లును తహశీల్దార్లు పరిశీలించాలన్నారు. బిఎల్వోలు డోర్ టు డోర్ వెరిఫికే షన్ వెళ్ళినప్పుడు ఎలాంటి ఒత్తిడికి లంగరాదని ఆమె తెలిపారు.18 సంవత్సరాల నిండిన యువతీ, యువకులు ఓటరు జాబితాలో నమోదు చేయుటకు ఫారం 6 ద్వారా చేయించేటపుడు పుట్టిన తేదీకి సంబంధించిన సర్టిఫికెట్లను తప్పక తీసుకోవాలన్నారు. ఇంటింటి సర్వే వివాదాలకు తావు లేకుండా నిర్వహించాలని, అలసత్వం వహిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని జిల్లా కలెక్టరు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు సి.హెచ్ పెద్దిరాజు, యంపిడివో సంగాని వెంకటేశ్వర రావు, బియల్ వోలు , సచివాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.