
- నవంబరు 15న విజయవాడలో బహిరంగ సభ
- సీతారాం ఏచూరి, బివి రాఘవులు హాజరు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో: సిపిఎం ఆధ్వర్యాన అక్టోబరు 30, నవంబరు రెండో తేదీల్లో బయలుదేరే మూడు యాత్రలు నవంబరు 8, 9, 10 తేదీల్లో విజయవాడకు చేరుకుంంటాయి. దీనికి సంబంధించిన వివరాలను రాష్ట్ర నాయకత్వం వెల్లడించింది.
- ఏజెన్సీ జాతా
పార్వతీపురం జిల్లా సీతంపేట నుంచి 2023 అక్టోబరు 30వ తేదీ ఉదయం 10 గంటలకు యాత్రను బివి రాఘవులు ప్రారంభిస్తారు. అదేరోజు మధ్యాహ్నం కురుపాంలో జరిగే సభలో పాల్గంటారు. 31న జాతాలో జాతీయ మహిళా నాయకులు ఎస్ పుణ్యవతి పాల్గంటారు. ఈ జాతాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, కిల్లో సురేంద్ర, ఎ అశోక్, యం సూర్యనారాయణ, హైమావతి, దడాల సుబ్బారావు, ఎస్ అనిల్‌కుమార్ పాల్గంటారు. ఈ జాతా ఎనిమిదోతేదీ సాయంత్రం విజయవాడ చేరుకుంటుంది. జాతాను వి వెంకటేశ్వర్లు పర్యవేక్షిస్తారు. అన్ని జాతాల వెంట కళాకారుల దళం ఉంటుంది.
- జాతా రూట్ :
కురుపాం
అరకువేలి
పాడేరు
రంపచోడవరం
పోలవరం
ఏలూరు
గన్నవరం
విజయవాడ
- మందస జాతా
శ్రీకాకుళం జిల్లా మందస నుంచి 2023 నవంబరు 2వ తేదీ ఉదయం 10 గంటలకు మందసలో ప్రారంభమయ్యే జాతాను జాతీయ నాయకులు విజ్జూకృష్ణన్ ప్రారంభించి అదేరోజు శ్రీకాకుళంలో జరిగే బహిరంగసభలో పాల్గంటారు. 2023 నవంబరు 10వ తేదీ సాయంత్రం ఆరుగంటలకు ఈ జాతా విజయవాడ చేరుకుంటుంది. ఈ జాతాలో కె లోకనాథం, ఎవి నాగేశ్వరరావు, యం హరిబాబు, కె ధనలక్ష్మి, కొల్లాటి శ్రీనివాస్ పాల్గంటారు. ఈ యాత్రను పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం సీతారాం పర్యవేక్షిస్తారు.
- జాతా రూట్ :
పలాస
విజయనగరం
పెందుర్తి
గాజువాక
స్టీల్
అనకాపల్లి
కాకినాడ
రాజమండ్రి
అమలాపురం
నర్సాపురం
భీమవరం
మచిలీపట్నం
విజయవాడ
- ఆదోని జాతా
కర్నూలు జిల్లా ఆదోని నుండి 2023 అక్టోబరు 30వ తేదీ ఉదయం 10 గంటలకు ఆదోనిలో ప్రారంభమయ్యే జాతాను జాతీయ నాయకులు అశోక్ ధావలే ప్రారంభించి కర్నూలులో జరిగే బహిరంగసభలో పాల్గంటారు. 2023 నవంబరు 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు తాడేపల్లిలో ముగుస్తుంది. ఈ జాతాలో ఎంఎ గఫూర్, వి కృష్ణయ్య, కె ఉమామహేశ్వరరావు, దయా రమాదేవి, వి శివనాగరాణి, ఓ నల్లప్ప, ఎం భాస్కరయ్య పాల్గంటారు. కె ప్రభాకరరెడ్డి పర్యవేక్షిస్తారు. నవంబరు 9వ తేదీన తాడేపల్లికి చేరుతుంది.
- జాతా రూట్ :
కర్నూలు
నంద్యాల
బద్వేలు
అనంతపురం
పుట్టపర్తి
చిత్తూరు
తిరుపతి
గూడూరు
నెల్లూరు
కందుకూరు
సంతనూతలపాడు
ఒంగోలు
అద్దంకి
నర్సరావుపేట
సత్తెనపల్లి
చిలకలూరిపేట
చీరాల
బాపట్ల
తెనాలి
గుంటూరు
మంగళగిరి
తాడేపల్లి