Jul 28,2023 10:12

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర ప్రభుత్వంలోని మంత్రిత్వ శాఖలు, డిపార్టమెంట్‌ల్లో 9,64,354 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు. రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2022 మార్చి 31 నాటికి మంత్రిత్వ శాఖలు, డిపార్టమెంట్‌ల్లో గ్రేడ్‌ ఎ పోస్టులు 30,606, గ్రేడ్‌ బి పోస్టులు 1,11,814, గ్రేడ్‌ సి పోస్టులు 8,21,934 ఖాళీగా ఉన్నాయని కేంద్ర మంత్రి తెలిపారు.
 

                                            కేంద్ర ఉన్నత విద్యా సంస్థల్లో 32 వేల పోస్టులు ఖాళీ

కేంద్ర ఉన్నత విద్యా సంస్థల్లో 32 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుభాష్‌ సర్కార్‌ తెలిపారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2023 జూలై 20 నాటికి దేశంలోని కేంద్ర ఉన్నత విద్యా సంస్థల్లో 32 వేల పోస్టుల ఖాళీగా ఉన్నాయని తెలిపారు.
 

                               సెంట్రల్‌ యూనివర్శిటీల్లో 21,215 టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు ఖాళీ

సెంట్రల్‌ యూనివర్శిటీల్లో 21,215 టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుభాష్‌ సర్కార్‌ తెలిపారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2023 ఏప్రిల్‌ 1 నాటికి సెంట్రల్‌ యూనివర్శిటీల్లో 5,825 టీచింగ్‌, 15,390 నాన్‌ టీచింగ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.