Nov 20,2023 08:45

ఇసుక తీరమంతా
ఇంకిన కన్నీళ్లే
కనుకనే
తాకి వెళ్లిన సాగరానికి
తనువంతా ఉప్పు నీళ్లే !

ఒడ్డున నిలిచిన శిలలన్నీ
ఒట్టిపోయిన తీపి కలలే
కనుకనే
చుట్టుముట్టిన అలల సడిలో
హౌరెత్తిన అలజడులే!
 

- డా. డి.వి.జి.శంకరరావు, మాజీ ఎంపీ,
94408 36931