Jul 07,2023 08:18
  • ముంపు సాకుతో సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, రుణాలకు ప్రభుత్వం మంగళం
  • నాలుగేళ్లుగా అంపశయ్యపై వ్యవసాయం

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం విలీన మండలాల రైతులకు మొండిచేయి చూపిస్తోంది. దీంతో, ఆ ప్రాంతంలో వ్యవసాయ రంగం అంపశయ్యపైకి చేరింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక, కూనవరం, విఆర్‌.పురం, చింతూరు మండలాల్లో అధికారుల గణాంకాల ప్రకారం 26,222 ఎకరాల్లో పంటల సాగు జరుగుతోంది. పోడు, నదీ పరివాహక లోతట్టు తదితర భూములు వెరసి క్షేత్రస్థాయిలో 50 వేల నుంచి 60 వేల ఎకరాలు సాగులో ఉన్నాయి. 373 గ్రామాలకు చెందిన 1.20 లక్షలకుపైగా గిరిజన, గిరిజనేతర కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనోపాధి పొందుతున్నాయి. మొక్కజొన్న, మిర్చి, పొగాకు, మినుములు, పత్తి, వరి సాగు ఇక్కడ అధికం. అపరాలు, కొన్ని రకాల వాణిజ్య పంటలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి. అయితే, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. గోదావరి ముంపు మండలాల పేరుతో గత నాలుగు సంవత్సరాలుగా సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, రుణాలను ప్రభుత్వం ఇవ్వడం లేదు. 41.15, 45.72 కాంటూర్ల పరిధిల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఎకరా వరి సాగుకు రూ.30 వేలు, మొక్కజొన్నకు రూ.60 వేలు, నువ్వుల పంటకు రూ.20 వేలు, మిర్చికి రూ.1.50 లక్షలు, పత్తికి రూ.40 వేలు పెట్టుబడి ఖర్చవుతోందని గిరిజన రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారమూ లేకపోవడంతో సాగు పెట్టుబడి కోసం దళారుల వద్ద అప్పులు చేయాల్సి వస్తోందని, గత్యంతరం లేని పరిస్థితుల్లో వారు అడిగిన ధరకు పంటలను విక్రయించాల్సి వస్తోందని వాపోతున్నారు. కొన్నిసార్లు దళారులు నియమించుకున్న ఏజెంట్లు నాసిరకం విత్తనాలను అంటగడుతున్నారని తెలిపారు. 2021లో చింతూరులో సుమారు 1500కుపైగా ఎకరాల్లో నాసిరకం వరి విత్తనాల వల్ల రైతులు నష్టపోయారు. ఇటువంటి ఉదాహరణలు

ప్రతి మండలంలోనూ ఉన్నాయి. గోదావరి నదీ పరివాహక ప్రాంతం కావడంతో సారవంతమైన నల్లరేగడి భూములు ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాలతో పోల్చితే ఏ మాత్రమూ తీసికట్టు కాదని ఇక్కడి రైతులు చెబుతున్నారు.
 
                                                                      సబ్సిడీ రుణాలు అందడం లేదు

నాకు రేఖపల్లిలో ఎనిమిది ఎకరాల సాగు భూమి ఉంది. ఏటా ధాన్యం, నువ్వులు పండిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ముంపు రికార్డులలో మా గ్రామం లేదు. అయినా, 2019లో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సబ్సిడీ రుణాలు, ఎరువులు, విత్తనాలు మంజూరు చేయడం లేదు. 2020లో సాగు కోసం ప్రయివేట్‌ అప్పు చేశాను. పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో దళారులను ఆశ్రయించక తప్పలేదు. వారు అడిగిన ధరకు విక్రయించడంతో నష్టం వచ్చింది. గతేడాది వరదల వల్ల నష్టపోయాను. ఈ ఏడాది రైతు భరోసా కేంద్రానికి వెళ్లి సబ్సిడీ విత్తనాలు అడిగితే ఇచ్చేదిలేదని అక్కడి సిబ్బంది తేల్చి చెప్పారు.
                                                              - కురసం జయరాజు, గిరిజనుడు, ఉమ్మడివరం, విఆర్‌.పురం మండలం

                                                                     ప్రభుత్వం సహకరించాలి

మా కుటుంబానికి 18 ఎకరాల భూమి ఉంది. ఏటా దళారుల వద్ద అప్పు తీసుకుంటున్నాను. నూటికి రూ.3 చొప్పున వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. మా ఊరు 45.72 కాంటూరు పరిధిలో ఉంది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ముంపులో లేదు. అయినా, ప్రభుత్వ యంత్రాంగం ఎటువంటి సహకారమూ అందించడం లేదు. ఏటా లక్షల రూపాయలు అప్పు చేసి సాగు చేయడం, దళారులు అడిగిన ధరకు విక్రయించడంతో కొన్నిసార్లు కూలి కూడా గిట్టుబాటు కావడం లేదు. మమ్మల్ని తరలించే వరకైనా సబ్సిడీ రుణాలు, ఎరువులు, విత్తనాలు అందించాలి.
                                                                                 - కె.మారయ్య, గిరిజనుడు, ఉమ్మడివరం, విఆర్‌.పురం మండలం