ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ప్రజాశక్తిలో ఉద్యోగిగా దీర్ఘకాలం పనిచేసిన సిహెచ్ మారుతీ శ్రీనివాసరావు శుక్రవారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా ప్రావిడంట్ ఫండ్ రీజనల్ కమిషనరుా2 ఎస్ శ్రీకాంత్ రెడ్డి పిఎఫ్ పెన్షన్ ఆర్డర్ కాపీ (పిపిఒ)ని శ్రీనివాసరావుకు ఉద్యోగ విరమణ రోజునే అందజేశారు. విజయవాడ పిఎఫ్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాశక్తి ఎడివిటి జనరల్ మేనేజర్ వై తిరుపాల్రెడ్డి, నాగరాజు పాల్గొన్నారు.