ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ప్రజాశక్తి ఉద్యోగిగా సుదీర్ఘకాలం పనిచేసిన పి శౌరి మంగళవారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా ప్రావిడెంట్ ఫండ్ రీజనల్ కమిషనరు శ్రీకాంత్ రెడ్డి పర్యవేక్షణలో శౌరికి పిఎఫ్ పెన్షన్ ఆర్డర్ (పిపిఓ) కాపీని ఇన్‌స్పెక్టర్ పి జవహర్‌లాల్ అందజేశారు. పిఎఫ్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాశక్తి హెచ్‌ఆర్ జనరల్ మేనేజర్ విటి తోడరమల్, పిఎఫ్ కార్యాలయ ఎస్‌ఎస్‌ఒ టిఎమ్‌కెవి శేష్, పిఎఫ్ ఆఫీసు సిబ్బంది పాల్గొన్నారు.