- గుదిబండగా డిమాండ్ ఛార్జీలు
- జులై ఒకటి నుంచి మూసివేత !
- నష్టాలతో నడపలేమంటున్న యాజమాన్యాలు
- రోడ్డున పడనున్న 50 వేల కార్మిక కుటుంబాలు
ప్రజాశక్తి- అనకాపల్లి ప్రతినిధి : పెంచిన విద్యుత్ ఛార్జీల భారం భరించలేక విద్యుత్ ఆధారిత ఫెర్రో పరిశ్రమలు నడపలేని స్థితికి చేరుకున్నాయి. ఎనర్జీ ఇన్సింటివ్ ఇండిస్టీస్ పేర డిమాండ్ ఛార్జీలు కిలోవాట్‌కు రూ.475 పెంచడంతో ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగింది. డిమాండ్ ఛార్జీలకు తోడు ట్రూఅప్, ఇంధన ఛార్జీలు, వినియోగ ఛార్జీలు సహా ఎలక్ట్రిసిటీ డ్యూటీ (ఇడి) కూడా హెచ్చయింది. యూనిట్‌కు ఆరు పైసలున్న ఇడి ఛార్జీలను రూపాయికి పెంచడంతో ఫెర్రో ఎల్లాయీస్ కంపెనీలకు విద్యుత్ భారం తడిసిమోపుడైంది. మొత్తం ఈ భారమంతా కలిపి యూనిట్‌కు ఎనిమిది రూపాయలకుపైగా చెల్లిస్తున్నట్లు యాజమాన్య ప్రతినిధులు చెబుతున్నారు. ఫెర్రో ఉత్పత్తి ఖర్చులకు తగినట్లు అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగకపోవడం, ముడిసరుకు ధరలు తగ్గకపోవడంతో నష్టాలతో పరిశ్రమలు నడుస్తున్నాయి. రాష్ట్రంలో ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమలు 36 ఉన్నాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 17, అనకాపల్లి జిల్లాలో ఐదు, మిగిలినవి రాష్ట్రంలో ఇతర చోట్ల ఉన్నాయి. వీటిలో దాదాపు 50 వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమలకు విద్యుత్ రాయితీ ఇవ్వకపోతే వచ్చే నెల నుంచి ఉత్పత్తి నిలిపివేయాలని యాజమాన్యాలు తీసుకున్న నిర్ణయం వల్ల వీరంతా రోడ్డున పడనున్నారు.
ఇప్పటికే మూతబడిన 3 పరిశ్రమలు
విద్యుత్ ఛార్జీల భారం భరించలేక విజయనగరం జిల్లా బొబ్బిలిలోని ఇంపెక్స్, మెరకముడిదాం మండలం గర్భాంలోని ఆంధ్రా ఫెర్రో ఎల్లాయీస్, అనకాపల్లి జిల్లాలోని సరోజిని ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమలు ఇప్పటికే మూతపడ్డాయి. ప్రభుత్వం ఆదుకోకపోతే మిగిలిన 33 పరిశ్రమలూ మూతపడనున్నాయని యాజమాన్యాలు చెప్తున్నాయి. వివిధ రూపాల్లో విద్యుత్ ఛార్జీలు పెంచడంతో టన్ను ఒక్కంటికీ రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు నష్టం వాటిల్లుతోందని అంటున్నాయి. ఇతర దేశాల్లో యూనిట్ విద్యుత్ రూపాయి యాభై పైసల నుంచి రెండు రూపాయల మధ్య ఉండగా, మన రాష్ట్రంలో ఎనిమిది రూపాయలుపైగా ఉందని చెప్తున్నాయి. ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉన్న దేశాల పరిశ్రమలతో పోటీపడలేక పరిశ్రమలను మూసేయాలన్న నిర్ణయానికి వచ్చామని అంటున్నాయి. ఫెర్రో ఉత్పత్తులను ఎక్కువగా జపాన్, తైవాన్, రష్యా, ఆస్ట్రేలియా, ఇతర యూరప్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. గతంలో డిమాండ్ ఛార్జీల నుంచి ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమలకు మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం నుంచి కిలోవాట్‌కు రూ.475 చొప్పున వసూలు చేస్తోంది. ఇది ఫెర్రో పరిశ్రమలకు శరాఘాతంగా మారింది. డిమాండ్ ఛార్జీలూ పెరగడంతో అచ్యుతాపురం సెజ్‌లో 1.40 లక్షల కిలోవాట్‌ల లోడ్ కలిగిన అభిజిత్ ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమ నెలకు రూ.5.32 కోట్ల నుంచి రూ.6.65 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. ఇదికాకుండా నెలకు వినియోగించిన 8 కోట్లకుపైగా యూనిట్లకు యూనిట్ ఒక్కంటికీ రూపాయి చొప్పున ఇడి కింద రూ.8 కోట్లు చెల్లిస్తోంది. ఎపి విద్యుత్ నియంత్రణ మండలి (ఎపిఇఆర్‌సి) నిబంధనల ప్రకారం పరిశ్రమ సామర్థ్యానికి తగినట్లు విద్యుత్ వినియోగించుకున్నా, లేకపోయినా లోడ్‌లో ప్రతి నెలా 80 శాతానికి డిమాండ్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంది. ఈ నిబంధన తమకు భారంగా మారిందని యాజమాన్యాలు అంటున్నాయి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమలు ప్రతి నెలా చెల్లించాల్సిన డిమాండ్ ఛార్జీలు











