మాట్లాడుతున్న నాయకులు
సుకుమార్‌తో వైసిపి నేతలు భేటి
ప్రజాశక్తి-దగదర్తి:కావలి వైసీపీలో కలకలం రేగి కాక పుట్టిస్తున్నట్లు అవుతుంది. బుధవారం కావలి నియోజకవర్గంలోని అనేమడుగు గ్రామంలో జరిగిన రాంప్రసాద్ రెడ్డి ఉత్తర క్రియలలో నాయకుల కలయిక సంభాషణలు కావలి వైసీపీలో కలకలం సష్టిస్తున్నాయి. గతంలో దగదర్తి మండలంలో రెండు మూడు స్థానాల్లో ఉన్న ఇద్దరు నాయకులు ప్రస్తుతం వైసీపీ బహిష్కత నేతగా ఉన్న సుకుమార్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఈ విషయంలో అందరిలో ఆసక్తిని రేపుతోంది. జిల్లాలో వైసీపీలో పెద్ద వారు వేమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డి సహకారంతో కావలి వైసీపీ సీటు కోసం ప్రయత్నిస్తున్నారని, దీనికి సదరు నాయకులు అంగీకారం తెలిపారు. పుకార్లు నియోజకవర్గంలో షికార్లు చేస్తున్నాయి.కావలి టిడిపి అభ్యర్థిగా కావ్య కష్ణారెడ్డి ఖరారు అయితే మండలంలోని రెండు మూడు స్థానాల్లో ఉన్న నాయకులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పలు గ్రామాల నాయకులు కలిసి పయనించేందుకు సిద్ధమై ఉన్నారు. ఇప్పటికే ఆ దిశగా కావ్య కష్ణారెడ్డి వారితో చర్చలు జరిపి ఏర్పాట్లు చేసుకొని ఉన్నట్లు మండలంలో అందరు అనుకుంటున్నారు. మండలంలోని చౌటపుత్తడు గ్రామానికి చెందిన నాయకునికి మూడుసార్లు అవమానాలకు గురైతే సదరు విషయమై మండల స్థాయి నియోజకవర్గ స్థాయి నాయకులకు ఫిర్యాదు చేసిన తాను అవమానింపబడ్డానని ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. మండలంలో జగనన్న ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రతిపక్ష పార్టీ నాయకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సదరు సమస్య విషయమై అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించని కారణంగానే నేడు మండలంలో జగనన్న ఇల్లు శంకుస్థాపనకు సైతం నోచుకోకపోవడం కారణమైంది. దగదర్తి మండలం నాయకుల పయనం సుకుమార్ రెడ్డి వైపు లేదా కావ్య కష్ణారెడ్డి వైపా అన్న చర్చ జోరుగా సాగుతోంది. మొదటి నుండి బలంగా ఉండగా తదనంతరం టిడిపి అధికారంలోకి వచ్చిన వైసీపీ అభ్యర్థి అయిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కి మండలవాసులు పట్టం కట్టడం గమనార్హం. మండలంలో ప్రస్తుతం వైసిపి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది.










