Sep 21,2023 19:27

రికార్డులు పరిశీలిస్తున్న తహశీల్దార్‌

రికార్డులు పరిశీలిస్తున్న తహశీల్దార్‌
సచివాలయాల్లో తనిఖీలు
ప్రజాశక్తి-సీతారామపురం:మండలంలోని అయ్యవారిపల్లి, సింగారెడ్డీ పల్లి సచివాలయాలను గురువారం తహశీల్దార్‌ ఎంవి. సుధాకర్‌ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు, మూమెంట్‌ రిజిస్టర్‌, సిబ్బంది విధి నిర్వహణ రిజిస్టర్‌ లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క సచివాలయ సిబ్బంది సచివాలయం లో పనివేళల్లో అందుబాటులో ఉండాలని, బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ ఖచ్చితంగా వేయాలని, సాయంత్రం 3నుంచి 5 గంటల వరకు అందరూ అందుబాటులో ఉండి స్పందన కార్యక్రమం నిర్వహించాలన్నారు.సచివాలయం లో సేవలను పెంచాలని తెలిపారు.
కార్యక్రమంలో ఇపిఒపిఆర్‌డి భార్గవి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్‌ పాల్గొన్నారు.