Sep 21,2023 19:12

రికార్డులను పరిశీలిస్తున్న ఎంపిడిఒ

రికార్డులను పరిశీలిస్తున్న ఎంపిడిఒ
రికార్డులు సక్రమంగా నిర్వహించాలి
ప్రజాశక్తి-వరికుంటపాడు:మండలంలోని విరువూరు, పెద్దిరెడ్డిపల్లి సచివాలయాలను గురువారం ఎంపీడీఓ శ్రీదేవి సందర్శించారు. ఈ సందర్బంగా ఆమె పలు రికార్డులను పరిశీలించారు. సచివాలయ ఉద్యోగులు రికార్డులను ఎప్ప టికప్పుడు సక్రమంగా సిద్ధం చేయాలని తెలిపారు. సమయపాలనతో విధులు నిర్వహించాలని , ప్రతి రోజూ సమ దుస్తులు ధరించి విధులకు హాజరు కావాలి అలా కాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమ సర్వేలు త్వరగా పూర్తి చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.