Sep 21,2023 19:24

మాట్లాడుతున్న బాధితురాలు

మాట్లాడుతున్న బాధితురాలు
న్యాయం చేయండి సారూ..
ప్రజాశక్తి-కావలి:నా కొడుకు, కోడలు నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. పోలీసు వారే నన్ను కాపాడాలి. స్ధానిక రైల్వేరోడ్‌లోని జర్నలిస్టు క్లబ్‌లో అరుంధతిపాళెంకు చెందిన చేవూరు జయలక్ష్మి పత్రికా సమావేశంలో పేర్కొన్నారు. చేవూరు జయలక్ష్మి భర్త చనిపోవడంతో అప్పుడు ఇంట్లోకి కొడుకు, కోడలు అక్రమంగా చొరబడి తల్లినైన నన్ను తిడుతూ బయటకు పంపించేసి ఆ ఇంటిని సొంతం చేసుకోవాలని చూస్తున్నారని తెలిపారు. సదరు ఈ విషయంపై స్థానిక ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వగా, సదరు ఎస్‌ఐ, సిఐ శ్రీనివాసరావు సంబంధిత వ్యక్తులు కొడుకు కోడలిని పిలిచారు.
సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలని చెప్పారు. తల్లి ఉండగా మీకెలా ఇప్పుడు ఆస్తి వస్తుంద?ని, ఆమెను ఎవరు చూస్తే వారికి ఆమె రాసిస్తుందని అంతవరకు ఎవరూ కూడా ఆమె నుండి ఆస్తిని లాక్కోవడం కానీ, లేదా అక్రమంగా చొరబడి ఉండడం కుదరదని మీరు ఆమె మాట వినాలని తెలిపారు.ఈసంఘటనతో ఆగ్రహించిన మా కొడుకు తన భార్య మాటలు విని నాపై పరుష పదజాలంతో మాట్లాడడమే కాక, కర్రలతో దాడులు చేసేందుకు వెనుకాడబోమని హెచ్చరించారని జయలక్ష్మి తెలిపారు..నా కొడుకు, కోడలు ఈ విషయంపై పోలీస్‌ స్టేషన్‌ లో తేల్చుకునేందుకు రాగా పోలీసువారు కూడా ఆమెకే హక్కులు ఉన్నాయని చెప్పారు. చేసేదేమి లేక వత్తాసు పలకడానికి వచ్చిన నాయకులు పోలీసువారిపైనే అభియోగాలు మోపడం సరికాదన్నారు.. నావిషయంలో పోలీసువారు నాకు అన్ని విధాలా సహకరిస్తున్నారని తెలిపారు. న్యాయం నా వైపు ఉండడంతో సహించలేని నా కొడుకు కోడలు కొంతమందిని వెంటేసుకుని తిరుగుతూ నాపై జులుం ప్రదర్శిస్తున్నారని తెలిపారు.నా సమస్యను పరి ష్కరించి న్యాయం చేయవలసినదిగా పోలీసువారిని మిక్కిలి మనస్సుతో కోరుతున్నానని తెలిపారు. తన భర్త ఇంటిలో నేను ప్రశాంతమైన జీవితం కూడా గడపలేని దుర్భర స్ధితికి నన్ను దిగలాగుతున్నారని ఆమె అన్నారు.