Sep 21,2023 19:09

నినాదాలు చేస్తున్న నాయకులు

నినాదాలు చేస్తున్న నాయకులు
కొనసాగుతున్న టిడిపి నిరసన దీక్షలు
ప్రజాశక్తి-కావలి.:నియోజవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు గురువారం 8వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలో కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ నేతలు, మైనారిటీ విభాగం సభ్యులు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ అధికసంఖ్యలో కూర్చున్నారు.పార్టీ శ్రేణులు ''అక్రమంగా అరెస్టు చేసిన చంద్రబాబుని వెంటనే విడుదల చేయాలి'', ''సైకో సిఎం డౌన్‌ డౌన్‌'', ''చేతకాని సీఎం దిగిపోవాలి'', ''సైకో పోవాలి- సైకిల్‌ రావాలి'', ''తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి'', ''మాలేపాటి నాయకత్వం వర్ధిల్లాలి'' అంటూ నినాదాలు చేశారు.
ఈసందర్భంగా ఆయన మాలేపాటి సుబ్బానాయుడు మాట్లాడారు.కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నేతలు అబ్దుల్‌ హఫీజ్‌, షేక్‌. ఖాదర్‌ బాషా(ఇట్టు), షఫీ,షేక్‌. మస్తాన్‌, గుత్తికొండ కిషోర్‌ బాబు, సురేంద్ర, మాలేపాటి నాగేశ్వరరావు, ఇబ్రహీం, బొట్లగుంట శ్రీహరి నాయుడు, తదితర నాయకులు పాల్గొన్నారు.