Dec 23,2020 19:51

యుజిసి ఇచ్చిన గుర్తింపు ఉత్తర్వులను చూపిస్తున్న కోయి సుబ్బారావు, శేఖర్‌ తదితరులు

గుంటూరు: కెకెఆర్‌ అండ్‌ కెఎస్‌ఆర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌(కిట్స్‌)కు యుజిసి అటానమస్‌ గుర్తింపును ప్రకటిస్తూ మంగళవారం ఉత్తర్వులు విడుదల చేసినట్లు కళాశాల ఛైర్మన్‌ కోయి సుబ్బారావు తెలిపారు. బుధవారం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో సుబ్బారావు మాట్లాడుతూ 2008లో స్థాపించిన కళాశాల అతి కొద్ది కాలంలోనే ఈ ఘనతను సాధించిందని పేర్కొన్నారు. ఈ గుర్తింపు పదేళ్లపాటు వర్తిస్తుందన్నారు.అత్యున్నత విద్యా ప్రమా ణాలతో, ఉన్నత సదుపాయాల కల్పనతో ఈ ఘనత సాధించిన జిల్లాలోని అతి కొద్ది కాలేజిల్లో కిట్స్‌ స్థానం సంపాదించిందన్నారు. కళాశాల సెక్రెటరీ కోయి శేఖర్‌ మాట్లా డుతూ కాలేజి స్థాపించిన కొద్ది కాలంలోనే నాక్‌-ఎ, ఎన్‌బిఎ గుర్తింపులను, జెఎన్‌టి యుకె శాశ్వత అఫిలియేషన్‌ను సాధించి, నేడు అటానమస్‌ స్థాయి కలిగిన కళాశాలగా నిలవటం తమకెంతో గర్వకారణంగా ఉందన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.బాబు, అకడమిక్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.హరిబాబు, పాల్గొన్నారు.