Jun 16,2023 11:48

ప్రజాశక్తి - ఆలమూరు (అంబేద్కర్‌ కోనసీమ) : ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోషన్‌ పక్వాడతో గర్భిణీలకు, బాలింతలకు మెరుగైన ఆరోగ్యం సమకూరుతుందని వైసిపి మండల కన్వీనర్‌, సర్పంచ్‌ తమ్మన శ్రీనివాస్‌ అన్నారు. మండలంలోని చెముడులంక అంగన్వాడి కేంద్రాల్లో జరుగుతున్న పోషణ్‌ పక్వాడ కార్యక్రమానికి సర్పంచ్‌ హాజరై పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ తమ్మన మాట్లాడుతూ ... అంగన్వాడి కేంద్రాల్లో పోషకాహార నిమిత్తం అందజేసే కిట్లను లబ్ధిదారులందరూ తీసుకోవాలన్నారు. దీంతో వాటిని తినడం ద్వారా పుట్టబోయే శిశువు దృఢంగా జన్మిస్తారన్నారు. ఆ బిడ్డల్ని కన్న తల్లి కూడా ఆరోగ్యకరంగా ఉంటుందన్నారు. వాటిని పాడుచేయకుండా ఉపయోగకరమైన ఆహారంగా తీసుకోవాలని కోరారు. అలాగే పిల్లల్ని శ్రద్ధగా అంగన్వాడి కేంద్రానికి పంపిస్తే వాళ్లకు విద్యతో పాటుగా మంచి నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడానికి అంగన్వాడీ టీచర్స్‌ సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి యు.రేణుక, సూపర్వైజర్‌ వరలక్ష్మి, వైసిపి నేతలు దొండపాటి చంటి, మోటూరి సురేష్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.