Sep 21,2023 19:06

రోడ్డుపై నినాదాలు చేస్తున్న నాయకులు

రోడ్డుపై నినాదాలు చేస్తున్న నాయకులు
జాతీయ రహదారి దిగ్బంధం
దగదర్తి-ప్రజాశక్తి:మాన్యశ్రీ మందకష్ణ మాదిగ ఆదేశాల మేరకు. దగదర్తి మండలం అల్లూరు రోడ్డు దగ్గర రహదారి సుమారు 30 నిమిషాల పాటు జాతీయ రహదారి దిగ్బంధంతో సుమారు కిలోమీటర్‌ మేర వాహనాలు నిలిచిపోవడం జరిగింది. ఎమ్మార్పీఎస్‌. ఎంఎస్పి ఈ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని ప్రధాన డిమాండ్‌. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చి ఈ చివరి పార్లమెంటు సమావేశాల్లో కూడా మా బిల్లును ప్రవేశపెట్టకపోతే భారతీయ జనతా పార్టీ మాదిగల అన్యాయం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.