Sep 21,2023 19:22

ర్యాలీ నిర్వహిస్తున్న నాయకులు

ర్యాలీ నిర్వహిస్తున్న నాయకులు
ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి
ప్రజాశక్తి-మర్రిపాడు:బిజెపి ప్రభుత్వం మాదిగ ఉప కులాలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సెప్టెంబర్‌ 18 నుంచి 22 వరకు జరుగుతున్న ఐదు రోజుల అత్యవసర పార్లమెంట్‌ సమావేశంలో ఎస్‌సి వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి మాట నిలబెట్టు కోవాలని ఎంఎస్‌పి జిల్లా కన్వీనర్‌ పందిటి అంబేద్కర్‌ మాదిగ డిమాండ్‌ చేశారు.గురువారం నెల్లూరు ముంబై జాతీయ రహదారి పై మహజన సోషలిస్ట్‌ పార్టీ , ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదిగలను గత తొమ్మిది ఏండ్లుగా బీజేపీప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. ఈ సమావేశాల లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టకపోతే బిజెపి తెలుగు నేలపై బీజేపీ అగ్రనేతలు ఎలా అడుగుపెడతారో చూస్తామని హెచ్చరించారు.కార్యక్రమంలో సోంపలల్లి హజరత్‌ మాదిగ, మల్లికార్జున మాదిగ, దుడ్డు రవి మాదిగ, మంద నాగరాజు, మహిళా నేతలు పాల్గొన్నారు.