Sep 21,2023 20:16

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సురేష్‌

ప్రజాశక్తి-కందుకూరు :మండలంలోని కరేడు గ్రామ దళితులకు భూములను ఆక్రమించిన వ్యక్తికి ఉలవపాడు రెవెన్యూ అధికారులు కొమ్ముకాస్తున్నారని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బి సురేష్‌ బాబు ఆరోపించారు. గురువారం సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బి సురేష్‌ బాబు మాట్లాడారు. 1998లో కరేడు గ్రామానికి చెందిన 34 మంది దళితులకు సర్వేనెంబర్‌ 1287 /3 నందు 8.50 సెంట్లు మెట్ట సీలింగ్‌ భూమిని ఒక్కొక్క దళితులకు 25 సెంట్లు చొప్పున డిఫారం పట్టాలిచ్చారన్నారు. అప్పటినుండి వారు సాగు చేసుకుంటున్నారన్నారు. ఓ వ్యక్తి దొంగ పాస్‌ పుస్తకం పుట్టించి ఆ భూమి తనదేనంటూ భయభ్రాంతులకు గురి చేస్తూ పొలంలో నివాసం ఉంటూ బెదిరిస్తున్నాడన్నారు. దీనిపై తహశీల్దార్‌ ఉదాసీనంగా వ్యవహరిసు ్తన్నారన్నారు. దీనిపై కోర్టుకు వెళ్ళగా రెండుసార్లు దళితులకే అనుకూలంగా వచ్చిందన్నారు. చివరకు కరేడు దళితులు హైకోర్టును ఆశ్రయించారన్నారు. ఆ పొలం కోర్టులో ఉంటే అక్కడ నివాసం ఉంటున్న కొండపనాయుడుని రెవెన్యూ అధికారులు ఏమనకుండా దళితులను మటుకు అటువైపు పోవద్దంటూ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా ఆ భూమిలో ఉంటున్న కొండప నాయుడు పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. దళితులకు న్యాయం చేయాలన్నారు. సిపిఐ నాయకులు వై ఆనందమోహన్‌, కోటేశ్వరరావు, కరెంటు దళితులు ప్రకాశం, కోటేశ్వరావు పాల్గొన్నారు.