- గతేడాది కన్నా రూ.3 లక్షల కోట్లు ఎక్కువ
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : కేంద్రం భారీ స్థాయిలో బహిరంగ మార్కెట్ రుణాలకు ఎగబడుతోరది. 2021-22తో పోలిస్తే 2022-23 తీసుకున్న రుణాలు మరింత పెరిగినట్లు తేలింది. తాజాగా రాష్ట్రాల ఆర్థిక కార్యదర్శుల సమావేశానికి తయారు చేసిన ఒక నివేదికలో ఈ విషయం సుస్పష్టమైంది. రాష్ట్రాలు చేసిన రుణాల వృద్ధి కన్నా కేంద్రం చేసిన రుణ వృద్ధి అత్యరత అధికంగా ఉండడం గమనార్హం. గురువారం అన్ని రాష్ట్రాల ఆర్థికశాఖల కార్యదర్శులతో రిజర్వ్ బ్యాంకు ఒక కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. ఇందులో రిజర్వ్ బ్యాంకు నిర్వహించే బహిరంగ మార్కెట్ రుణాల పరిస్థితిపైనా ప్రత్యేక అజెండాతో చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో కొన్ని గణారకాలను కూడా వెల్లడించింది. 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాల్లో మార్కెట్ బారోయింగ్స్‌లను ప్రస్తావించింది. ఇందులో 2021-22 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం గ్రాస్ మార్కెట్ బారోయింగ్స్ ద్వారా తీసుకున్న రుణాలు ఏకంగా రూ.11,27,382 కోట్లుగా తేలింది. అదే 2022-23లో రూ.14,21,000 కోట్లు బహిరంగ మార్కెట్ రుణాలుగా తీసుకోవడం గమనార్హం. అరటే ఏడాదిలో రూ.2,93,618 కోట్లు పెరిగింది. అదే రాష్ట్రాలు తీసుకున్న రుణాలను పరిశీలిస్తే.. 2021-22లో రూ.7,01,626 కోట్లుగా రుణాలు రికార్డయితే, 2022-23లో రూ.7,58,392 కోట్లుగా ఉన్నాయి. అంటే గతేడాది కన్నా సుమారు రూ.56 వేల కోట్లు మాత్రమే పెరిగింది. ఇక నెట్ రుణాల జాబితాలో కేంద్రం 2021-22లో రూ.8,63,103 రుణంగా తీసుకుంటే, 2022-23లో రూ.11,08,261 కోట్లు తీసుకురది. ఒక్క ఏడాదికే రూ.2,45,158 కోట్లు అదనంగా రుణర తీసుకున్నట్లయింది. అదే విభాగంలో రాష్ట్రాలు రూ.4,92,483 కోట్లు రుణాలుగా ఉరటే, 2022-23లో రూ.5,18,829 కోట్లుగా తేలిరది. కేవలం రూ.26,346 కోట్లు మాత్రమే గతేడాది కన్నా పెరిగాయి.










