Sep 21,2023 19:29

మాట్లాడుతున్న ఎంఇఒ

మాట్లాడుతున్న ఎంఇఒ
అక్షర చైతన్యంపై అవగాహన
ప్రజాశక్తి-ఉదయగిరి:అక్షర చైతన్యం పరీక్ష ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మండల విద్యాశాఖ అధికారి-2 తోట శ్రీనివాసులు పేర్కొన్నారు. గురువారం స్థానిక స్త్రీశక్తి భవనంలో ఆదివారం జరగబోయే అక్షర చైతన్యం పరీక్షకు సంబంధించి అన్ని పంచాయతీల సెక్రటరీలు సచివాలయ సంక్షేమ విద్య సహాయకులు వాలంటీర్లకు మండల అభివద్ధి అధికారిణి దేవరకొండ ఈశ్వరమ్మ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఎంఇఒ మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ15 సంవత్సరాల పైబడిన యువతీ యువకులు ఈ అక్షర చైతన్యం పరీక్షకు హాజరయ్యే విధంగా ప్రతి పంచాయతీలోని సచివాలయ సెక్రటరీలు, సంక్షేమ విద్యా సహాయకులు, వాలంటీర్లు బాధ్యత తీసుకొని అందరూ హాజరయ్యే విధంగా చూడాలని పలు సూచనలు చేశారు. సమావేశం లో అక్షర చైతన్యం మండల కోఆర్డినేటర్‌ షేక్‌ బాదుల్లా, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, సంక్షేమ విద్యా సహాయకులు పాల్గొన్నారు.