మాట్లాడుతున్న ఎంపిడిఒ
అక్షర చైతన్యం-2 పరీక్ష పై అవగాహన
ప్రజాశక్తి-అనంతసాగరం:వయోజన విద్య ద్వారా నిరక్ష్యరాసులకు అభ్యాసం నిర్వహించిన 18 ఏళ్ల పైబడిన వయోజనులకు సెప్టెంబర్ 24నుంచి మండలంలోని 46 సెంటర్ల లో అక్షర చైతన్యం-2 కార్యక్రమం ఉంటుందని ఎంపీడీఓ మధుసూదన్ రావు అన్నారు. గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో అక్షర చైతన్యం 2పరీక్ష నిర్వహణ, విధి విధానాలపై విద్యా సంక్షేమ సహాయకులకు, పరీక్ష నిర్వహణ సెంటర్ లలోని పరిశీలకులుగా నియమించబడిన పాఠశాల ప్రధానోపాధ్యాయులకు,
సిఆర్ ఎంటిలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అక్షర చైతన్యం-2పరీక్ష నిర్వహణ, విధివిధానాలు గురించి ఎలా నిర్వహించాలి, ఎలా మార్కులులు వేయాలి, ఆన్లైన్ ఏ విధంగా చేయాలి అనే అంశాలపై వయోజన విద్య జిల్లా సూపర్వైజర్ ఎల్ రాంకుమార్, మండల విద్యాశాఖ అధికారి-1 బాలకష్ణారెడ్డి, మండల విద్యాశాఖ అధికారి-2 ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పరీక్షను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. సంక్షేమ సహాయకులు ద్వారా సంబందిత కేంద్రాలకు పరీక్షా మెటీరియల్ పంపిణీ చేశారు.










