ఇంటర్నెట్‌డెస్క్ : ప్రముఖ బాలీవుడ్ జంట రణవీర్- దీపికా పదుకొనెలు తాజాగా 'కాఫీ విత్ కరణ్' సీజన్ 8లో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. కరణ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో రణ్వీర్- దీపికాలు పాల్గొనడం ఇదే మొదటిసారి. ఈ షోలో కరణ్ జోహార్ దీపికా- రణ్‌వీర్‌ల పెళ్లి వీడియోను ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరిద్దరూ పెద్దల సమక్షంలో 2018లో వివాహం చేసుకున్నారు. దాదాపు ఐదేళ్ల తర్వాత వీరి పెళ్లి వీడియో బయటకు విడుదలవ్వడంతో నెటిజన్లు ఆసక్తిగా వీక్షిస్తున్నారు.
కాగా, కాఫీ విత్ కరణ్‌జోహార్ షోకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక సీజన్ 8 ఈ గురువారం నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా ప్రసారమవుతోంది.