ఇంటర్నెట్‌డెస్క్ : ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి తెలుగులో 'సాహసవీరుడు సాగరకన్య, 'భలేవాడివి బాసు', 'వీడెవడండి బాబు', 'ఆజాద్' వంటి సినిమాల్లో నటించి మెప్పించారు. ఆమె ఇద్దరు పిల్లలకి తల్లి అయినా ఫిట్‌గా ఉంటూ నేటితరం హీరోయిన్లకు రోల్‌మోడల్‌గా నిలుస్తున్నారు. ఆమె సినీ ఇండిస్టీకి వచ్చి మూడు దశాబ్దాలు దాటినా.. ఇప్పటికీ నటిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. మరి శిల్పాశెట్టి ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటానికి తన హెల్త్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందామా..!
'నోని'తోనే నా రోజు మొదలవుతుంది..
'నోని'తోనే తన రోజు మొదలవుతుందని శిల్పాశెట్టి అన్నారు. 'నేను పొద్దున్నే తీసుకునే జ్యూస్‌లో నాలుగు చుక్కలు 'నోని జ్యూస్'ని వేసుకుని తాగుతాను. 'నోని'ని కలుపుకుని తాగడం వల్ల నేను రోజంతా యాక్టివ్‌గా ఉంటాను. ఇది నాకెంతో బలాన్నిస్తుంది' అని శిల్పాశెట్టి ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలో తెలిపారు.
'నోని' వల్ల ఆరోగ్య ప్రయోజనాలెన్నో..
'నోని' జ్యూస్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నోయిడా ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అండ్ హాస్పిటల్ ఛైర్మన్ డాక్టర్ రాజ్ వర్ధన్ తెలిపారు. మధుమేహం, జలుబు, దగ్గు, ఆందోళన, నిరాశ, అధిక రక్తపోటు వంటి సమస్యలను 'నోని' పరిష్కరిస్తుందని ఆయన అన్నారు. నోని మొక్క కానీ, ఆకులు, పండ్లు, వేర్లు ఇలా ఏదైనా ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుందని రాజ్ వర్ధన్ తెలిపారు. ఈ మొక్క కాఫీ చెట్టులా ఉంటుంది.
- నోనిలో యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయని అపోలో హాస్పిటల్స్ చీఫ్ న్యూట్రీషియనిస్ట్ డాక్టర్ ప్రియాంక రోహత్గి అన్నారు. నోని రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది. ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా సహాయపడుతుందని, కీళ్ల నొప్పుల్ని తగ్గిస్తుందని డాక్టర్ ప్రియాంక అన్నారు. అయితే నోని వల్ల ఆరోగ్య ప్రయోజనాలున్నా.. కొన్ని ప్రమాదాలను కలిగిస్తుందని డాక్టర్ రోహత్గి హెచ్చరించారు. నోనిలో అధిక పోటాషియం ఉంటుంది. కాలేయ సమస్యలు వచ్చే ప్రమాదముంది. నోని జ్యూస్ పరిమితంగా తీసుకున్నా.. దాని తాలుకా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ప్రధానంగా అలర్జీలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని తీసుకోబోయే ముందు ఆరోగ్య నిపుణులను సంప్రదిస్తే మంచిది అని ప్రియాంక రోహత్గి సూచించారు.