Jun 29,2023 08:52
  •  పురాతన, రీవైండ్‌ పంపుల వల్లే అధిక విద్యుత్‌ వాడకం
  •  అన్ని శాఖలకూ ఇంధనశాఖ సూచనలు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : పట్టణాలు, నగరాల్లో పలు అవసరాలకు వినియోగిస్తున్న విద్యుత్‌ పంపుసెట్లను అత్యవసరంగా మార్చాలని విద్యుత్‌శాఖ నిర్ణయించింది. పాత, అనేక దఫాలుగా రీవైండ్‌ చేసిన పంపుసెట్ల కారణంగా విద్యుత్‌ వినియోగం ఎక్కువగా ఉంటోందని ఆ శాఖ అధికారులు అంటున్నారు. అలాగే ప్రభుత్వ భవనాల్లో వినియోగిస్తున్న వాటిపైనా దృష్టి సారించాలని నిర్ణయించారు. ఈ మేరకు అన్ని శాఖల అధికారులకూ ఇరధనశాఖ లేఖ రాసింది.
ఇటీవల పలు ప్రాంతాల్లో రాష్ట్ర విద్యుత్‌ పొదుపు సంస్థ నిర్వహించిన ఒక సర్వేలో అనేక విద్యుత్‌ పంపు సెట్లలో అధిక విద్యుత్‌ వినియోగం నమోదవుతోందని గుర్తించారు. దీనివల్ల కోట్లాది రూపాయల వరకు నష్టం వాటిల్లుతోందని వెల్లడైంది. అనేక భవనాల్లో ఎప్పుడో కొనుగోలు చేసిన, చెడిపోయిన తరువాత ఐదుసార్లు కన్నా ఎక్కువ రీవైరడింగ్‌ చేసిన పంపులనే వాడుతున్నట్లు గుర్తించారు. వీటిల్లో విద్యుత్‌ ఆదా 46 శాతం నురచి 63 శాతం వరకు మాత్రమే ఉంటోందని, అదే బహిరంగ మార్కెట్‌లో లభ్యమయ్యే పరికరాల్లో 75 నురచి 85 శాతం వరకు ఆదా సామర్థ్యం ఉంటుందని గుర్తించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని 90 వేల వరకు ప్రభుత్వ భవనాల్లో విద్యుత్‌ ఆదా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుందని, తద్వారా 25 శాతం నుంచి 30 శాతం వరకు విద్యుత్‌ను ఆదా చేయొచ్చునని ఇరధనశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ భవనాల్లో ప్రస్తుతం పాత విద్యుత్‌ పరికరాలనే వినియోగిస్తున్నారని ఇంధన పొదుపు సంస్థ పేర్కొంది. పొదుపు సామర్ధ్యం ఎక్కువగా ఉన్న స్టార్‌ రేటెడ్‌ పరికరాలను వినియోగిస్తే విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించవచ్చునని అధికారులు అంటున్నారు. తద్వారా రానున్న కాలంలో విద్యుత్‌ బిల్లులు కూడా తగ్గుతాయని వారు తమ లేఖలో పేర్కొన్నారు.
ప్రభుత్వ భవనాల్లో ఇటువంటి చర్యలు చేపడితే, దాని ప్రభావం ప్రయివేటు భవనాలు, వ్యక్తులపైనా పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇదే అంశంపై ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద జరిగిన ఇంధన పొదుపు మిషన్‌ సమావేశంలో కూడా అనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

  • 2.5 కోట్ల కిలోవాట్లు ఆదా..

ప్రస్తుతం గుర్తిరచిన కొన్ని ప్రారతాల్లో 239 విద్యుత్‌ పంపుసెట్లను మార్పు చేయడం ద్వారా దాదాపు 2.5 కోట్ల కిలోవాట్ల విద్యుత్‌ను ఆదా చేయొచ్చని అంచనా వేశారు. ఈ అంచనా రూ.20 కోట్ల వరకు ఉరటురదని, కొత్త పంపు సెట్లను ఏర్పాటుచేసేందుకు రూ.17 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు.