Jun 13,2023 09:08
  • తెలంగాణకి రూ.2,486 కోట్లు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ కి పన్నుల్లో వాటా కింద రూ.4,787 కోట్లు విడుదల అయింది. తెలంగాణకి రూ.2,486 కోట్లు వచ్చాయి. రాష్ట్రాలకు ప్రతినెల ఇచ్చే రూ.59,140 కోట్లను, మూడో విడతగా కేంద్ర ప్రభుత్వం 28 రాష్ట్రాలకు రూ.1,18,280 కోట్లను సోమవారం విడుదల చేసింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు కూడా నిధులు విడుదల చేసింది.