Feb 02,2022 09:51

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను సిఐఐ స్వాగతిస్తుంది. ఇది పెట్టుబడులకు, ఉపాధికి ఊతం ఇచ్చేలా ఉంది. సులభ వ్యాపారం మరింత పెరగడానికి దోహదం చేయనుంది. ముఖ్యంగా వృద్ధిపై దృష్టి సారించి రూపొందించారు. సిఐఐ సూచించిన అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్నారు.
 

                                           రికవరీకి దోహదం : ఫిక్కీ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ మెహతా

దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీకి అనుకూలంగా బడ్జెట్‌ రూపకల్పన జరిగింది. పరిశ్రమలకు ఉపశమనం కల్పించేలా సంస్కరణలు కొనసాగాయి. ఒత్తిడిలో ఉన్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థలకు ఉపశమనం కల్పించేలా సంక్షేమ పథకాలను కొనసాగించింది. ప్రయివేటు పెట్టుబడులు, డిమాండ్‌ పెరిగేలా నిర్ణయాలున్నాయి.