కడప ప్రతినిధి సరికొత్త మార్పులతో విద్యా బోధనకు శ్రీకారం చుట్టాం. జిల్లాలోని 3,253 పాఠశాలలకు చెందిన ఒకటి నుంచి ఐదవ తరగతి విద్యార్థులకు మెరుగైన బోధనకు కృషి చేస్తున్నాం.ఉపాధ్యాయుల శిక్షణ తరగతులను సైతం పూర్తి చేశాం. జిల్లాలోని కస్తూరిభా గాంధీ గురుకుల పాఠశాలల్లో మెరుగైన విద్యా బోధనకు గెస్ట్‌ఫ్యాకల్టీల నియామకానికి గ్రీన్‌సిగల్ ఇచ్చింది. కెజిబివిల్లో ఉత్తమ ఫలితాల సాధనకు అవకాశం ఏర్పడింది. జిల్లాలోని 1000 ప్రభుత్వ పాఠశాలతోపాటు జూనియర్ కళాశాలల్లోనూ నాడు-నేడు పథకాన్ని అమలు చేస్తున్నాం. రెండవ దశ పనుల్లో రాష్ట్రంలో మూడవ స్థానంలో ఉన్నామని సమగ్రశిక్ష ప్రాజెక్టు ఆఫీసర్ ఎ.ప్రభాకర్‌రెడ్డితో ప్రజాశక్తి ముఖాముఖి.
నాడు-నేడు పథకాన్ని కళాశాలల్లోనూ అమలు చేయనున్నారా?
ప్రభుత్వ జూనియర్ కళాశాలలకూ నాడు-నేడు పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం ఆద ేశాలు జారీ చేసింది. రూ.ఎనిమిది కోట్ల వ్యయంతో జిల్లా లోని తొమ్మిది జూనియర్ కళాశాలలను ఎంపిక చేశాం. ఆ యా జూనియర్ కళాశాలల్లో 11 రకాల పనులను చేపట్టాం.
సరికొత్త మార్పులతో కూడిన విద్యాబోధన ఎలా ఉండనుంది.?
జిల్లాలోని 230 స్కూల్ కాంప్లెక్స్‌ల్లోని 3,250 ప్రభుత్వ పాఠశాలల్లో సరికొత్త విద్యాబోధనకు శ్రీకారం చు ట్టాం. జిల్లాలోని ఉపాధ్యాయులకు టీచింగ్ ఎట్‌రైట్ లెవెల్ (టిఎఆర్‌ఎల్) కింద శిక్షణా కార్యక్రమాన్ని నేటితో ము గించ డమైంది. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు బోధన సదుపాయాల కల్పన, ఆటపాటల్లో చురుకుదనం, గ్రూప్ డిస్కన్స్ వంటి శాస్త్రీయ పద్ధతులతో విద్యను బోధించేందుకు అవసరమైన కసరత్తు చేశాం.
నాడూ-నేడూ 2వ దశ గురించి వివరించండి?
నాడూ-నేడూ రెండవ దశ కింద రూ.325 కోట్లతో పనులు చేపట్టాం. 182.64 కోట్లతో 11 రకాల వసతుల కల్పనపై దృష్టి సారించాం. జిల్లాలోని 36 మండలాల పరిధిలో 624 పాఠశాలలను ఎంపిక చేయడమైంది. త్వరలో మరో 400 పాఠశాలలను ఎంపిక చేసే అవకాశం ఉంది. మొదటి విడత కింద రూ.225 కోట్లతో 1040 పాఠశాలలను ఆధునీకరించడంలో సఫలమయ్యాం.
కెజిబివిల్లో ఫ్యాకల్టీ కొరత ఎలా ఉంది?
జిల్లాలోని 29 కెజిబివి పాఠశాలల్లో ఫ్యాకల్టీ కొరత ఉన్న మాట వాస్తవమే. 158 మందితో కూడిన ఫ్యాకల్టీ నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలు అందజేయడమైంది. ప్రభుత్వం గెస్ట్‌ఫ్యాకల్టీ నియామకానికి గ్రీన్‌సిగల్ ఇచ్చింది.
కెజిబివిల్లో ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్ ఎప్పుడు?
కెజిబివి పాఠశాలల్లో ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభమైంది. రెండు రోజులుగా రిక్రూట్‌మెంట్ చేపట్టాం. నెలాఖరు నాటికి రిక్రూట్‌మెంట్ ప్రక్రియను పూర్తి చేసే ఆలోచనల్లో ఉన్నాం.
కెజిబివిల్లో నూతనశకం అంటున్నారేమిటి?
కెజిబివి పాఠశాలల్లో ఆటలు, పాటలు, మాటల్లో ప్రత్యేక తర్ఫీదునిస్తున్నాం. ఆటల విషయానికి వస్తే క్రీడా మైదానాలను అభివృద్ధి చేయడం, క్రీడా పరికరాలను అందుబాటులో ఉంచడం ద్వారా పిల్లల్లో దేహదారుడ్య సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాం. పాటల విషయాన్ని పరిశీలిస్తే పిల్లల్లోని సృజనాత్మకతను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నాం. మాటలు అంశానికి వస్తే క్లాస్‌రూమ్ సెమిర్స్ నార్స్ పేరుతో గతంలో ఉపాధ్యాయులు బోధించిన పాఠ్యాంశాలను విద్యార్థులచే బోధించే ప్రణాళికను తయారు చేశాం. తద్వారా విద్యార్థుల్లో బిడియం, సిగ్గు వంటి ప్రగతి నిరోధక జాడ్యాలు తొలగి, భవిష్యత్ తరాలకు నాణ్యమైన మానవ వనరులను అందించే ప్రయత్నం చేస్తున్నాం.










