Jun 23,2023 00:55

ప్రజాశక్తి-ఒంగోలు సబర్బన్‌: స్థానిక రిమ్స్‌ వైద్యశాల ఆవరణలో రూ.1.49 కోట్ల వ్యయంతో నిర్మించిన పట్టణ నిరాశ్రయుల భవనం, వన్‌స్టాప్‌ సెంటర్‌ను స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నగరానికి వివిధ పనుల మీద వచ్చేవారు, పట్టణంలో నారాశ్రయులుగా ఉన్న వారికి నిరాశ్రయుల భవనం, వన్‌స్టాప్‌ సెంటర్‌లు ఎంతో ఉప యోగకరంగా ఉంటాయని తెలిపారు. ప్రధానంగా రిమ్స్‌ వైద్య శాలకు వచ్చేవారికి ఈ సెంటర్‌లు ఉపయోగపడతాయని చెప్పారు. రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఈ భవనాలను నిర్వహణ బాధ్యతలను చూస్తుందని తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్‌ గండా సుజాత, మెప్మా పీడి టి రవికుమార్‌, డిఆర్‌డిఏ పీడి బాబురావు, నగరపాలక సంస్ధ కమిషనర్‌ ఎం వెంకటేశ్వర రావు, ఇండియాన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ ప్రకాశ్‌బాబు, ఆర్‌ ఎంఒ చైతన్యవర్మ, కార్పొరేటర్‌లు ఈదర వెంకట సురేష్‌బాబు, యనమల నాగరాజు, వైసిపి నేత కటారి శంకర్‌ పాల్గొన్నారు.
మెప్మా అర్బన్‌ మార్కెట్‌ ప్రారంభం
స్ధానిక అద్దంకి బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన మెప్మా అర్బన్‌ మార్కెట్‌, బాపూజీ మార్కెట్‌ కాంప్లెక్స్‌ ఎదురుగా ఏర్పాటు చేసిన జగనన్న ఈమార్ట్‌లలో ప్రదర్శన, అమ్మకాలను స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గురువారం ప్రారంభించారు. మహిళలు తయారు చేసి విక్రయిస్తున్న వివిధ రకాల ఉత్ప త్తులను ఎమ్మెల్యే పరిశీలించి, వారిని అభినందించారు. కొన్ని వస్తువులను ఆయన స్వయంగా కొనుగోలు చేశారు. కార్యక్రమంలో నగర మేయర్‌ గంగాడ సుజాత, మెప్మా పీడి టి రవికుమార్‌, కమిషనర్‌ వెంకటేశ్వరరావు, కార్పొరేటర్‌ బేతంశెట్టి శైలజ, మెప్మా సిటి మిషన్‌ మేనేజర్‌ కొండయ్య పాల్గొన్నారు.