బడ్జెట్ తమిళనాడు రాష్ట్ర ప్రజలను తీవ్రంగా నిరాశ పరిచింది. జిఎస్‌టి పరిహారాన్ని జూన్‌కు మించి పొడిగించక పోవడం కేంద్రప్రభుత్వ పెద్దన్న వైఖరిని తెలియజేస్తోంది. వరదలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన తమిళనాడుకు బడ్జెట్‌లో ఎటువంటి ఉపశమనం లేదు. 'ఒకే దేశం.. ఒకే రిజిస్ట్రేషన్' ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాం. ప్రజల సంక్షేమాన్ని మరిచిపోయిన బడ్జెట్ ఇది. కేంద్రం ఏ ప్రకటన చేసినా రాష్ట్రాల హక్కులను లాక్కోవడానికే. 'కో-ఆపరేటివ్ ఫెడరలిజం' ప్రాతిపదికన లక్ష కోట్ల కేటాయింపులతో రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చినట్లు చెబుతూ, ఆ నిధులను ప్రధానమంత్రి 'గతి శక్తి' పథకానికి ఖర్చు చేస్తామని ప్రకటించారు. ఏ షరతులు లేకుండా లక్ష కోట్ల కేటాయిస్తే, దానిని స్వాగతించే వారిలో నేనే ముందుండే వాడిని. రాష్ట్రాలకు నిధులు అందకుండా అనేక షరతులు విధిస్తే, రాష్ట్రాలకు ఎలా సహాయపడుతుంది? ఉపాధి హామీ పథకాన్ని పట్టణ పంచాయతీలకు విస్తరించకపోగా, బడ్జెట్‌లో రూ.25 వేల కోట్లు తగ్గించడం అణగారిన వర్గాల ప్రజల చేతుల్లోని డబ్బును లాగేసుకోవడమే.










