Feb 02,2022 09:44

న్యూఢిల్లీ : 'ఇది ప్రధానంగా పెట్టుబడిదారుల బడ్జెట్‌ ప్రసంగంలా ఉంది. దేశంలో ఇప్పటి వరకూ ఏ ఆర్థిక మంత్రి ఇలాంటి ప్రసంగం చేయలేదు. మొత్తం బడ్జెట్‌లో పేదలన్న పదం కేవలం రెండుసార్లు మాత్రమే ఉంది. ఆరో పేరాలో పేద అనే పదం కేవలం రెండుసార్లు మాత్రమే వచ్చింది. ఈ దేశంలో పేద ప్రజలు ఉన్నారని ఈ మాత్రం గుర్తు చేసినందుకు ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు. దేశంలో ప్రజల తలసరి ఆదాయం తగ్గిందని బడ్జెట్‌లో స్పష్టమైంది. 2019-20లో రూ.1,08,645గా ఉన్న తలసరి ఆదాయం.. 2021-22లో రూ.1,07801కు క్షీణించింది. ఇదే సమయంలో తలసరి వినిమయం రూ.62,056 నుంచి రూ.59,043కు పడిపోయింది. దాదాపుగా 4.6 కోట్ల మంది మరింత పేదరికంలోకి జారిపోయారు. ప్రజలపై భారం మోపేలా బడ్జెట్‌ ఉంది. వచ్చే 25 ఏళ్ల కోసం అమ్రిత్‌ కాల్‌ను ప్రకటించినప్పటికీ... ప్రస్తుత ప్రజల బతుకుదెరువును పట్టించుకోలేదు.'