- కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : 2014 మార్చి 31 అంటే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోల్పోయిన నాటికి కేంద్ర ప్రభుత్వం అప్పు రూ.58.6 లక్షల కోట్లు కాగా, 2023 మార్చి 31 నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు రూ.155.6 లక్షల కోట్లు (జిడిపిలో 57.1 శాతం)కుపెరిగింది. సోమవారం లోక్‌సభలో ఒక ప్రశుకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం అప్పు ప్రతి ఏడాదీ పెరుగుతూనే ఉంది. అప్పుకుచెల్లిస్తును వడ్డీ కూడా ప్రతి ఏడాదీ పెరుగుతూనే ఉంది.
- గత ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం అప్పు
సంవత్సరం అప్పు (లక్షల కోట్లు) చెల్లిస్తున్న వడ్డీ (లక్షల కోట్లు)
2018-19 రూ.93.3 రూ.5.83
2019-20 రూ.105.1 రూ.6.12
2020-21 రూ.121.9 రూ.6.80
2021-22 రూ.138.7 రూ.8.05
2022-23 రూ.155.6 రూ.9.28
- సైన్యంలో 3,367 వైద్య సిబ్బంది పోస్టులు ఖాళీ
త్రివిద దళాల్లో 3,367 వైద్య సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి అజయ్ భట్ తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశుకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నావీలో 630 డాక్టర్, 73 డెంటల్, 701 నర్స్ పోస్టులు ఖాళీగా ఉనాుయి. ఇతర మెడికల్ స్టాఫ్ 1,960 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- సెంట్రల్ యూనివర్సిటీల్లో 5,825 టీచింగ్ పోస్టులు ఖాళీ
దేశంలోని 45 సెంట్రల్ యూనివర్సిటీల్లో 5,825 టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. లోక్‌సభలో ఒక ప్రశుకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలో 45 సెంట్రల్ యూనివర్సిటీల్లో ఎస్‌టి 516, ఎస్‌సి 861, ఒబిసి 2,185, జనరల్ కేటగిరీ 1,662 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అలాగే 2023 ఏప్రిల్ 1 నాటికి సెంట్రల్ యూనివర్సిటీల్లో 15,390 నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని మరో ప్రశుకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ సమాధానమిచ్చారు.
- 96,261 కంపెనీలు స్వచ్ఛందంగా నిష్క్రమణ
దేశంలో గడిచిన ఐదేళ్లలో 96,261 కంపెనీలు స్వచ్ఛందంగా నిష్క్రమించాయని కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ తెలిపారు. లోక్‌సభలో ఒక ప్రశుకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2018 ఏప్రిల్ 1 నుంచి, 2023 మార్చి 31 వరకు 96,261 కంపెనీలు స్వచ్ఛందంగా నిష్క్రమించాయని పేర్కొన్నారు.










