- కేంద్ర మంత్రి సమాధానంతో ఏకీభవించటం లేదు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాష్ట్రానికి ఇవ్వాల్సిన చెల్లింపులు పెండింగ్‌లో ఉంటే రైతులకు మద్దతు ఎలా వస్తుందని కేంద్రాన్ని వైసిపి ఎంపి మిథున్‌రెడ్డి ప్రశ్నించారు. ధరల మద్దతు పథకంలో భాగంగా ఈ ఏడాది గతేడాది కంటే 62 శాతం తగ్గించి కేవలం రూ.1,500 కోట్లు మాత్రమే బడ్జెట్‌లో కేటాయించి రైతులకు ఎలా న్యాయం చేస్తారని మంగళవారం లోక్‌సభ ప్రశోుత్తరాల సమయంలో మిథున్‌రెడ్డి ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లుగా రూ.1700 కోట్లు పైగా పెండింగ్ ఉందని, పెండింగ్‌లపై కేంద్రం నిర్ణయం వెల్లడించాలని కోరారు. యుటిలైజేషన్ సర్టిఫికేట్లు అందించినా నిధులు విడుదల చేయలేదని గుర్తుచేశారు. దీనికి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి సమాధానమిస్తూ.. మద్దతు ధర నిరంతరం పెరుగుతోందని తెలిపారు. సేకరించిన ధాన్యానికి సంబంధించి మూడు రోజుల్లో సొమ్ములు నేరుగా రైతుల ఖాతాల్లోకి పంపుతామని తెలిపారు. దీనిపై మిథున్ రెడ్డి స్పందిస్తూ తాను కేంద్ర మంత్రి సమాధానంతో ఏకీభవించటం లేదని అన్నారు. బడ్జెట్ తగ్గించిన నేపథ్యంలో రైతులకు గడువులోగా చెల్లింపులు చేయడానికి కేంద్రం ప్రణాళిక ఏంటని వైసిపి సభ్యుడు పోచ బ్రహ్మానందరెడ్డి ప్రశిుంచగా.... మద్దతు ధర విషయంలో నిధులకు ఎలాంటి కొరత లేదన్నారు. ధరల వ్యత్యాసం వచ్చినపుడు మార్కెట్‌లో అవసరమైతే జోక్యం చేసుకుంటామని కేంద్రసహాయ మంత్రి తెలిపారు.
- మత్స్యకారులకు నష్టాన్ని భర్తీ చేయండి
భారత నావికాదళాల విన్యాసాలు స్వాగతించదగినవే అయినప్పటికీ వాటి వల్ల మత్స్యకారుల జీవనోపాధిపై ప్రభావం చూపుతున్నాయని వైసిపి ఎంపి మోపిదేవి వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం రాజ్యసభలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. విశాఖపట్నంలో నౌకదళ విన్యాసాలతో విధించిన ఆంక్షలు చేపల వేట, చేపల వ్యాపారంపై ప్రభావం చూపుతున్నాయన్నారు. నౌకదళ విన్యాసాల సమయంలో రోజువారీ చేపల వేట, వ్యాపారం లేకపోవడంతో సంప్రదాయ, చినుచిను మోటారుబోట్ల మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతున్నారన్నారు. విశాఖపట్నంలో నౌకాదళాల కార్యక్రమాలు, విన్యాసాల సమయంలో చేపలవేట, చేపల వ్యాపార కార్యక్రమాలపై విధించిన ఆంక్షల కారణంగా మత్స్యకారులకు జరిగిన నష్టాన్ని భర్తీచేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
- మూడు రాష్ట్రాల్లో 40 స్టోరేజీ కేంద్రాలు
ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రల్లో 46380 మెట్రిక్ టనుుల సామర్థ్యం కలిగిన 40 స్టోరేజీ కేంద్రాలకు రూ.136.82 కోట్లు గ్రాంటు విడుదల చేశామని కేంద్రం తెలిపింది. వైసిపి ఎంపి గొడ్డేటి మాధవి అడిగిన ప్రశుకుకేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ ఇండిస్టీస్ సహాయ మంత్రి ప్రహ్లాద్ పటేల్ మంగళవారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఆపరేషన్ గ్రీన్ పథకాన్ని 2018 నవంబరు నుంచి అమలు చేస్తున్నామని, నోటిఫైడ్ పండ్లు, కూరగాయలకు 50 శాతం రవాణా, నిల్వ సబ్సిడీ అందిస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి తెలిపారు.
- రివర్ ర్యాంచింగ్ ప్రతిపాదన రాలేదు
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద రివర్ ర్యాంచింగ్‌కు సంబంధించి ఏపి ప్రభుత్వం ప్రతిపాదన పంపలేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆక్వా ఉత్పత్తుల్లో ఏపి దేశంలోనే తొలి స్థానంలో ఉందని, రాష్ట్రంలో మత్స్య అభివృద్ధికి కేంద్రం వాటాగా రూ.115.60 కోట్లు విడుదల చేశామనివైసిపి ఎంపి ఎంవివి సత్యనారాయణ, గొడ్డేటి మాధవిలు అడిగిన ప్రశ్నకు కేంద్ర మత్స్య శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా మంగళవారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
- రైల్వే ప్రాజెక్టుల నిమిత్తం వాటా ఇవ్వాలని ఎలా అడుగుతారు?
రాష్ట్ర విభజన అనంతరం రూ.16వేల కోట్ల ఆర్థిక లోటులో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను రైల్వే ప్రాజెక్టుల నిమిత్తం వాటా ఇవ్వాలని ఎలా అడుగుతారని కేంద్రాన్ని వైసిపి ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నించారు. బడ్జెట్‌లో ఏపీలో రైల్వే పనుల నిమిత్తం రూ.9వేల కోట్లు కేటాయించారని సంతోషించాలో బాధపడాలో అర్థంకావడం లేదన్నారు. రాష్ట్ర విభజన కన్నా ముందుగానే కోటిపల్లి-నరసాపురం , గూడూరు-దుగరాజపట్నం, నడికుడి-శ్రీకాళహస్తి ఖమ్మం-ప్రొద్దుటూరు, కొండపల్లి-కొత్తగూడెం, కడప-బెంగళూరు, భద్రాచలం-కొవ్వూరు, తుముకూరు-రాయగఢ, మరికుప్పం-కుప్పం రైల్వే లైన్లు అనుమతించారని వాటిలో చాలా వరకూ పురోగతిలో లేవనిగుర్తుచేశారు. మంగళవారం లోక్‌సభలో రైల్వే పద్దులపై చర్చలో ఎంపీ శ్రీకఅష్ణదేవరాయలు మాట్లాడారు. మూడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన సౌత్‌కోస్ట్ రైల్వేజోన్‌కు నిధులు కేటాయించి కార్యకలాపాలు ప్రారంభించాలన్నారు. గుంటూరు రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు కేటాయించిన రూ.80 కోట్లు ఇతరత్రా డివిజన్లకు మళ్లించారన్నారు. గుంటూరు స్టేషన్‌కు కేటాయించిన నిధులు ఎందుకు మళ్లించారు అనేది తేల్చాల్సి ఉందన్నారు. తిరిగి నిధులు కేటాయించిన అభివృద్ధి చేయాలన్నారు. కరోనా పేరుతో నడికుడిలో పలు రైళ్లను ఆపడం లేదని అడిగితే ఆదాయం రావడం లేదని అధికారులు చెబుతున్నారన్నారు.
- రద్దు చేసిన పాసింజర్ రైళ్లు పునరుద్ధరించాలి
కరోనా సమయంలో రద్దు చేసిన పాసింజర్ రైళ్లను పునరుద్ధరించాలని ఎంపి బి.వి.సత్యవతి డిమాండు చేశారు. పలాస-విశాఖ, విశాఖ-విజయవాడ, విశాఖ-రాజమండ్రి, విశాఖ-కాకినాడ పాసింజర్లు రద్దు వల్ల సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విశాఖ నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్‌కు బుల్లెట్ ట్క్రెన్ నడపాలని ఆమె కోరారు. నెల్లిమర్ల, గరివిడి , అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నం రోడ్ వంటి స్టేషన్లలో సదుపాయాలు మెరుగుపరాచాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో 23 బౌద్ధ స్మారకాలు, ప్రాంతాలు గుర్తించారని వాటిని అభివృద్ధి చేయడానికి పర్యాటక రైళ్లు ఏర్పాటు చేయాలని కోరారు.










