Feb 02,2022 09:06
  • మంత్రి నిర్మలసీతారామ్‌ క్షమాపణ

న్యూఢిల్లీ : మధ్య తరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మొండి చెయ్యి చూపించింది. ఆదాయపు పన్ను (ఐటి) మినహాయింపులపై ఈ బడ్జెట్లో ఎటువంటి ప్రస్తావన తీసుకురాలేదు. దీంతో వేతన జీవులు తీవ్ర నిరాశకు గురయ్యారు. పన్ను శ్లాబుల్లో ఎలాంటి ఉపశమనం లేకపోవడంతో సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వంపై విమర్శలవర్షం కురిపించారు. పన్ను శ్లాబుల్లో కోతలను తేనందుకు పన్ను చెల్లింపుదారులకు మంత్రి సీతారామన్‌ క్షమాపణ తెలిపారు. ఆదాయపు పన్ను శ్లాబులు యథాతథంగా కొనసాగనున్నాయి. కొన్ని స్వల్ప మార్పులు మాత్రం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్ను మినహాయింపు పరిమితిని 10 నుంచి 14 శాతానికి పెంచారు. యజమాని వాటా కింద చెల్లించే 14 శాతం వరకు పన్ను మినహాయింపు ఉంది. దీన్ని కొత్తగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేయడంతో వారికి స్వల్ప ఊరట లభించింది. ఇక ఆదాయ పన్ను దరఖాస్తుల్లో జరిగే పొరపాట్లను సరి చేసుకునేందుకు కేంద్రం రెండేళ్ల వరకు అవకాశం కల్పించింది.