హైదరాబాద్ : తెలంగాణలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే బిల్లుపై ఉత్కంఠ కొనసాగుతోంది. బిల్లుపై చర్చించేందురు గవర్నర్ తమిళిసై అధికారులకు సమయం ఇచ్చారు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఆర్ అండ్ బీ కార్యదర్శి, అధికారులతో గవర్నర్ సమావేశం కానున్నారు. మరోవైపు సభాపతి పోచారంతో సమావేశమైన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరు.. ఈ బిల్లు విషయమై చర్చించారు. గవర్నర్ అనుమతిస్తే శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.










