దేశవ్యాప్తంగా పలు భాషల్లో నటిస్తూ విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు వెర్సటైల్ హీరో రానా దగ్గుబాటి. ప్రభు సాల్మోన్ దర్శకత్వంలో రానా ప్రధానపాత్ర పోషించిన చిత్రం అరణ్య. ఇందులో విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రీయా పింగోల్కర్ కీలక పాత్రలు పోషించారు. ఈరోస్ ఇంటర్‌నేషనల్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా మార్చి 26న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలైంది. హిందీలో హాథీ మేరేసాథీ, తమిళంలో కాదన్ అనే టైటిల్స్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. అరణ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతున్న సందర్భంగా 'అరణ్య' గురించి రానా చెప్పిన ముచ్చట్లు..
రానా దగ్గుబాటి నటించిన 'అరణ్య' చిత్రంలో అడవి ఏనుగులను రక్షించే స్నేహితుడు (మావటివాడు)గా నటించాడు. జంతువుల భాష తెలిసి, వాటితో మమేకం అయ్యే పాత్ర అది. దీనికోసం రానా చాలానే కష్టపడ్డాడు. అయితే ఇందులో ఆయన పాత్ర ఆహార్యంలోనూ మేనరిజంలోనూ ఒక ప్రత్యేకత ఉంది. పూర్తిగా పెరిగిన గడ్డం, మీసాలు, చేతిలో పొడవాటి కర్రలాంటి ఆయుధం. నడిచేటప్పుడు గూని వున్నట్లుగా వంకరగా నడవడం చూడగానే దర్శకునికి ఈ పాత్ర హాలీవుడ్ నటుడు రొటేన్ టొమటోస్ స్ఫూర్తిగా రానా చేసినట్లు తెలిపారు. టెన్ కమాండ్‌మెంట్స్‌లో టొమటోస్ క్యారెక్టర్‌ను చూసి తనను ఆ విధంగా దర్శకుడు మలిచినట్లు రానా తెలిపారు. దర్శకుడు ప్రభు సాల్మన్ అరణ్య పాత్ర కోసం ప్రత్యేక తర్ఫీదు ఇచ్చాడు. దీంతో ఆ సినిమాను పలుసార్లు చూసి, తనకు అనుకూలంగా మార్చుకున్నారు రానా. మరి ఎప్పుడో 1956లో వచ్చిన టెన్ కమాండ్‌మెంట్స్‌ను చూసి, ఆ తరహాలో పాత్ర డిజైన్ చేయడం విశేషమే కదా! మరికొన్ని విశేషాలు ఆయన మాటల్లోనే..
కథ విన్నప్పుడు..
ఏనుగులు, అడవుల గురించి బాగా పరిశోధన చేసిన ప్రభు అరణ్య కథను రెడీ చేశారు. ఈ కథ చెబుతున్నప్పుడే అడవి గురించి మొదటిసారి నాకు డీటైల్డ్‌గా అర్థమైంది. ఒక మనిషి, జంతువు కాన్‌ఫ్లిక్ట్‌తో సాగే చిత్రమిది. ఇలాంటి సినిమా చేయాలనిపించి అరణ్య కథను ఒప్పుకున్నాను. అయితే ఈ సినిమా డైరెక్టర్ ప్రభు సాల్మాన్ తీసిన కుమ్కి కథలో ఏనుగు ఒక పార్టు మాత్రమే!
ఒకేసారి 18 ఏనుగులతో షూట్...!
అరణ్య షూటింగ్ కోసం 15 రోజులు ముందుగానే థారులాండ్ వెళ్లాం. అక్కడి అడవుల్లో మాకు కావాల్సిన లొకేషన్స్ కోసం సెర్చ్ చేశాం. ఏనుగుల పార్కుల్లో షూటింగ్ చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకున్నాం. ఈ కథ గురించి ప్రభు చెప్పినప్పుడు 18 ఏనుగులతో షూట్ చేయాల్సి ఉంటుందన్నారు. అందుకే ముందుగా ఏనుగులతో సాన్నిహిత్యం పెంచుకునేందుకు, రేంజర్స్ పర్యవేక్షణలో శిక్షణ తీసుకున్నాను. సాధారణంగా ఒక ఏనుగు మన పక్కన నడి స్తేనే భూమి కంపిస్తుంది. అలాంటిది ఒకేసారి 18 ఏనుగులు వెనుక నడుస్తుంటే.. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేను!
పోరాటం అందుకే!
అరణ్య మన భూమి కోసం, భవిష్యత్ తరాల కోసం ఎంటైర్ సోసైటీ మీదే వార్‌కి రెడీ అయిన ఒక వ్యక్తి కథ. వినగానే నాకు ఎగ్జైటింగ్‌గా అనిపించింది. ఏనుగుల వల్ల అడవుల విస్తీర్ణం పెరుగుతుంది. అది మన భవిష్యత్ తరా లకు మేలు చేస్తుంది. అందుకే అరణ్య భవిష్యత్ తరాల కథ!
ఆ క్షణం చాలా భయం వేసింది..!
ఏనుగులకు ఆహారం ఇవ్వడం, వాటికి స్నానం చేయిం చడం, వాటితో ఎక్కువసేపు గడపటం వంటి వాటివల్ల నేను వాటికి దగ్గరయ్యాను. ఇందుకు ఓ వారం టైమ్ పట్టింది. తర్వాత షూటింగ్ అంతా బాగానే జరిగింది. ఏనుగులకు దగ్గరయ్యే క్రమంలో భయంతో ఒక జేబులో అరటిపండు. ఇంకో జేబులో బెల్లంముక్క ఉంచుకునేవాడిని. ఓసారి జేబులో ఉన్న అరటిపండు కొద్దిగా బయటకు వచ్చింది. అది చూసి నా దగ్గర చాలా అరటిపండ్లు ఉన్నాయనుకొని ఏనుగులన్నీ హఠాత్తుగా నా దగ్గరకొచ్చాయి. ఆ క్షణం చాలా భయం వేసింది. అయితే క్యారెక్టర్ పరంగా నా చేతిలో ఉన్న కర్ర, అడవిలో కనిపించే కుందేలు, జింక ఇతర జీవాలు కూడా సినిమాలో చిన్న క్యారెక్టర్స్‌గా కనిపిస్తాయి. మేజర్‌గా ఇది ఏనుగుల కథ. షూటింగ్‌లో ఉన్నన్ని రోజులూ ఏనుగుల దగ్గర నుంచి నేను ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నాను.
వారి జీవితాల ఆధారంగానే..!
'ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా'గా పిలవబడే జాదవ్ పయెంగ్, ఎలిఫెంట్ విస్పరర్‌గా పిలవబడే లారెన్స్ ఆంథోనీ జీవితాల్లోని కొన్ని సంఘటనలతో పాటుగా ఘాజీరంగా ఫైట్‌ను ఈ సినిమాలో చూపించాము. అయితే చిత్రంలోని క్యారెక్టర్ పేరు నరేంద్రభూపతి. ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా బిరుదు వచ్చాక అందరూ అతన్ని 'అరణ్య' అని పిలుస్తుంటారు. కాబట్టి ఈ సినిమాకు 'అరణ్య' టైటిల్ పెట్టాము. అయితే చిత్రాన్ని మొత్తం ఆరు అడవుల్లో చిత్రీకరించాం. ఒక షాట్ థారులాండ్ ఎలిఫెంట్ ఫార్క్‌లో తీస్తే, ఆ షాట్ కొనసాగింపు కేరళ అడవుల్లో ఉంటుంది. మరోషాట్ కొనసాగింపు మహాబలేశ్వరంలో.. ఇలా వేర్వేరు అడవుల్లో తీసిన సన్నివేశాలు థియేటర్స్‌లో ఓ ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. ముఖ్యంగా రసూల్ ఇచ్చిన సౌండ్ ప్రేక్షకులను నిజమైన అరణ్యంలో ఉన్న అనుభూతిని ఇస్తుంది. ఈ సినిమా కోసం టీమ్ అందరూ చాలా కష్టపడ్డారు. విష్ణు విశాల్, జోయా, శ్రీయా అందరం కష్టపడి ఓ మంచి సినిమా చేశాం.
గొప్ప అనుభవం...!
'అరణ్య' సినిమా నాలో పెద్ద మార్పు తెచ్చింది. అడవి నుంచి వచ్చిన తర్వాత నేను పెళ్లిచేసుకోవడమే ఒక నిదర్శనం. అయితే బాహుబలికి షాట్ అయిపోగానే వెంటనే ఏదైనా తినడానికి అవకాశం ఉండేది. మిగిలిన వర్కంతా సిజీలో చేసేవారు. కానీ అరణ్య కథ చెప్పినప్పుడే దర్శకుడు మీరు బాగా తగ్గాలి అన్నారు. పాత్రపరంగా అలా కనిపిం చాలి. ఇక ఫారెస్ట్‌లో షూటింగ్ దగ్గర రొటీన్‌గా తినేవి దొర కవు. ప్రకృతిలో లభించినవే తినాలి. అదొక గొప్ప అనుభవం. వెరైటీ కథలను చేసే నేనే ఇలా లాక్‌డౌన్ వస్తుందని, అది కథగా చెప్పినా నమ్మేవాణ్ణి కాదేమో. పోస్ట్ కరోనా మనుషు లు, వాళ్ల ఆలోచనల్లోనూ మార్పు తెచ్చింది. ప్రస్తుతం గ్లోబల్ సినిమాలు ఎక్కడ తీస్తారు అంటే హైదరాబాద్‌లోనే తీస్తాం అనే స్థాయికి డెఫినెట్‌గా వచ్చాం. నా కెరీర్‌లో అమితాబ్, అజిత్‌లాంటి డిఫరెంట్ యాక్టర్స్‌తో యూనిక్ చిత్రాల్లో నటిం చే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను.
పూర్తి పేరు : రానా దగ్గుబాటి
పుట్టిన తేదీ : 1984, డిసెంబర్ 14
పుట్టిన ప్రాంతం : చెన్నై, తమిళనాడు
చదువు : ఇండిస్టియల్ ఫొటోగ్రఫీలో గ్రాడ్యుయేషన్
హాబీస్ : ఫొటోగ్రఫీ, బాక్సింగ్, డ్రైవింగ్
ఇష్టమైన ఆహారం : హలీమ్, బిర్యానీ
ఇష్టమైన నటులు : కమల్‌హాసన్, అక్షరుకుమార్, కత్రినా కైఫ్
నివాస ప్రాంతం : హైదరాబాద్
భార్య : మిహిక
తల్లిదండ్రులు : సురేష్‌బాబు దగ్గుబాటి, లక్ష్మి దగ్గుబాటి
సోదరీ, సోదరుడు : మాళవిక దగ్గుబాటి, అభిరామ్ దగ్గుబాటి