Feb 02,2022 10:30

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : విద్యారంగంలో డిజిటల్‌ ఆన్‌లైన్‌ ఛానెల్స్‌ను పెంచడం ద్వారా భౌతిక విద్యను దూరం చేయడానికి కేంద్రప్రభుత్వం పూనుకుందని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి పేర్కొన్నారు. మహిళల అభివృద్ధికి సాధికారికతను మిషన్‌ పోషణ్‌, మిషన్‌ వాత్స్యల్య, మిషన్‌ శక్తి పథకాలను ప్రకటించారని కేటాయింపులు మాత్రం లేవన్నారు. గత సంవత్సరం బడ్జెట్‌ కంటే ఈ సంవత్సరం బడ్జెట్‌లో 0.71నుంచి 0.66కి తగ్గించారని ఆమె తెలిపారు. మహిళలు,పిల్లల సంక్షేమం కోసం మొత్తం బడ్జెట్‌ కేటాయింపు ఒక శాతం మాత్రమేనన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణకు అవసరమైన ఏర్పాట్లు కాక ఐది సదుపాయాల పేరుతో స్మార్ట్‌ అంగన్‌వాడీలను ప్రకటించడం ,పిల్లలకు , గర్బిణీ స్త్రీలకు అవసరమైన పోషనను నిర్లక్ష్యం చేయడమే అన్నారు.