Aug 03,2022 23:42

సంఘీభావం తెలుపుతున్న ఎంపీ

ప్రజాశక్తి-శ్రీకాకుళం అర్బన్‌ : న్యూఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యాన బుధవారం చేపట్టిన ధర్నాకు ఎంపీలు కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, గల్లా జయదేవ్‌, కనకమేడల రవీంద్రతో కలిసి సంఘీబావం తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బిసిలకు టిడిపి అండగా నిలుస్తుందన్నారు. కుల గణన, ప్రత్యేక బిసి మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో బిసి రిజర్వేషన్లు అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించాలన్నారు.