Feb 02,2022 10:28

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కేంద్రం ప్రభుత్వం ప్రతి ఏటా విద్యారంగాన్ని విస్మరిస్తోందని ఎస్‌ఎఫ్‌ఐ పేర్కొంది. 2022-23 బడ్జెట్లో అరకొర కేటాయింపులే జరిపిందని వివరించారు. ఈ మేరకు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె.ప్రసన్నకుమార్‌, ఎ.అశోక్‌ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. నూతన కేటాయింపులు ఏ మాత్రమూ సరిపోవని విద్యారంగానికి కనీసం 10 శాతం నిధులు ఇవ్వాలని సూచించారు. కార్పొరేట్‌ శక్తుల్లో విద్యారంగాన్ని పెట్టే కుట్ర ఇందులో ఉందని తెలిపారు. డిజిటల్‌ విద్యకు ప్రోత్సాహం కల్పించడమంటే కార్పొరేట్‌శక్తులే విద్యారంగంలో జొరబడే అవకాశం ఉందని పేర్కొన్నారు. 12 యూనివర్శిటీలకు నిధుల ప్రస్తావన లేదని తెలిపారు. బడ్జెట్లో విద్యారంగానికి కేటాయింపు 2.58 శాతమేనన్నారు.