న్యూఢిల్లీ : ''ఆర్భాటం తప్ప అంతా శూన్యమే. ''నిరుద్యోగం, ద్రవ్యోల్బణంతో నలిగిపోతున్న సామాన్యులకు ఈ బడ్జెట్‌లో ఒరిగేదేమీ లేదు. పెగాసస్ స్పిన్ బడ్జెట్'' అని మమత వ్యాఖ్యానించారు. గత రెండేళ్లుగా ఆర్థిక కార్యకలాపాలన్నీ పట్టాలు తప్పాయి. ఈ తరుణంలో ప్రస్తుతం దేశాన్ని పట్టిపీడిస్తున్న ఏ ఒక్క సమస్యను కూడా బడ్జెట్ పరిష్కరించలేదు. కోవిడ్ బాధితులకు ఎలాంటి పథకం లేదు. మహిళలు, యువత, వికలాంగులు, మధ్య తరగతి వర్గాల బడ్జెటా ఇది? ఎవరి బడ్జెట్ ఇదని మమత ప్రశ్నించారు. రూ.44.7 లక్షల కోట్ల విదేశీ రుణాలు వున్నాయని ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు. మరి వాటిని ఎలా తీరుస్తారన్నది బడ్జెట్‌లో ప్రస్తావించరా? అని ప్రశ్నించారు. రాష్ట్రాలకు లక్ష కోట్ల సాయం అందిస్తామంటూ ప్రకటించారు. షరతుల మీద షరతులు పెట్టి, రాష్ట్రాలు ఉపయోగించుకోకుండా చేస్తారు.










