'డాక్టర్ కావాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నా. నేను తప్పకుండా డాక్టర్ అవుతానని ఇంట్లో వాళ్లకు మాటిచ్చా. నటిగా ఉంటూనే ఎంబీబీఎస్ పూర్తి చేసేందుకూ సిద్ధం అవుతున్నా. నటిగా ప్రేక్షకులను అలరించటాన్ని, వాళ్ల ప్రేమాభిమానాలు పొందటాన్ని అదృష్టంగా భావిస్తున్నా. అలాగే డాక్టర్ కావడం నా తొలి ప్రాధాన్యం. నటిగా నా అభినయంతో, వైద్యురాలిగా చికిత్స అందించడం ద్వారా ప్రజల స్వాంతన ఇవ్వాలనుకుంటున్నా' అని నటి శ్రీలీల తెలిపారు. ఈనెల 24న విడుదల కానున్న 'ఆదికేశవ' సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. శ్రీలీల ప్రస్తుతం 'ఆదికేశవ', 'గుంటూరు కారం', 'ఉస్తాద్ భగత్‌సింగ్', 'ఎక్సట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమాల్లో నటిస్తున్నారు.