ప్రజాశక్తి - ఆలమూరు (అంబేద్కర్ కోనసీమ) : మండలంలోని మడికి శ్రీ భక్తాంజనేయ అంతర్రాష్ట్ర కూరగాయల మార్కెటుకు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సెలవు ప్రకటించినట్లు కూరగాయల మార్కెట్ కమిటీ శుక్రవారం వెల్లడించారు. ప్రతి ఏటా మహాశివరాత్రి భారీ అన్నసమారాధన జరుగుతుందన్నారు. అలాగే ఈ ఏడాది కూడా కూరగాయల మార్కెట్ ప్రాంగణంలో జాతీయ రహదారి పక్కన భక్తులందరూ వచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వివిధ జిల్లా నుండి వచ్చే రైతులు, వ్యాపారస్తులు శనివారం మార్కెట్ సెలవును గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాలూరి సత్తిబాబు, దొండపాటి వెంకటేశ్వరరావు (బులిరెడ్డి), పర్వతనేని వెంకట రామారావు (అబ్బు), చెల్లుబోయిన సింహాచలం, అందే బుజ్జి, అయినవల్లి నాగేశ్వరరావు, పలువురు మార్కెట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.










