Nov 08,2023 21:10

హైదరాబాద్‌ : కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ సంస్థ లివ్‌ఎస్‌వైటి విజయవంతంగా తాజాగా మరో 2.5 మిలియన్‌ డాలర్లు సమీకరించడం ద్వారా మొత్తంగా రూ.4.5 మిలియన్‌ డాలర్ల నిధులు అందుకున్నట్లయ్యిందని వెల్లడించింది. ఈ నిధులు అమెరికా కేంద్రంగా పని చేస్తున్న ఎస్‌వి క్వాడ్‌ అండ్‌ ఇన్వెంటస్‌ కాపిటల్‌ను పొందినట్లు పేర్కొంది. ఈ నిధులతో మరింత విస్తరణ చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఈ పెట్టుబడులు నిర్మాణ రంగంలోని తమ సాఫ్ట్‌వేర్‌ సంస్థ విలువను ప్రతిబింబిస్తున్నాయని లివ్‌ఎస్‌వైటి సిఇఒ కార్తిక్‌ తుము పేర్కొన్నారు.