వరంగల్ : ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో వరంగల్ జిల్లా తడిసి ముద్దయింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల రోడ్ల తెగిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా వరంగల్ నగరంలో మూడో డివిజన్ పరిధిలోని పైడిపల్లిలో వర్షాలకు ఒకరు మృతి చెందారు. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో పాత ఇంటి గోడ కూలి మీద పడటంతో ఆ సమయంలో ఇంట్లో ఉన్న రావిరాకుల విజయ్ (36) అనే వ్యక్తి చనిపోయాడు. సమాచారం అందగానే జీడబ్ల్యూఎంసీ అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు . విజయ్ మృతదేహాన్ని పోలీసులు ఎంజీఎం దవాఖానకు తరలించారు. విజయ్ మరణంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. కాగా, భారీ వర్షాలు కురుస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.