Apr 15,2023 13:18

తణుకు రూరల్‌ (పశ్చిమ గోదావరి) : ఎపి సీడ్స్‌ లో కార్మికుల హక్కులు అమలు చేయకుండా చట్ట విరుద్ధంగా వ్యవహారిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పీవీ.ప్రతాప్‌ డిమాండ్‌ చేశారు. శనివారం సీడ్స్‌ వద్ద టెండర్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ... సిఐటియు యూనియన్‌ ఆధ్వర్యంలో కార్మికులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రతాప్‌, యూనియన్‌ అధ్యక్షులు టీ.రామకృష్ణ మాట్లాడుతూ... గత అనేక సంవత్సరాలుగా ఉన్న రిజిస్టర్‌ యూనియన్‌ ఏక పక్షంగా అధికారులు టెండర్‌ పేరుతో తొలగించడం అన్యాయం అన్నారు. కార్మికులకు ఎన్ని చట్టాలు ఉన్న వైసిపి ప్రభుత్వం లో ఉపయోగం లేదని విమర్శించారు. ' మా పని వేరే కార్మికులతో చేయిస్తూ, మా పొట్టలు కొడుతున్న ప్రభుత్వ వైఖరిని ప్రతీ ఒక్కరూ ఖండించాలి ' అని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జి.త్రిమూర్తులు, రమణ, బి.శ్రీహరి, సాంబశివరావు, సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు.