Nov 04,2023 21:01

న్యూఢిల్లీ : అనీల్‌ అగర్వాల్‌కు చెందిన వేదాంత లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో రూ.1,783 కోట్ల నష్టాలు చవి చూసినట్లు ఆ సంస్థ వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1,808 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.37,351 కోట్లుగా ఉన్న సంస్థ ఆదాయం.. క్రితం క్యూ2లో రూ.39,585 కోట్లకు పెరిగింది.