రెడ్డిగూడెం (ఎన్‌టిఆర్) : భారత దేశ స్వాతంత్య్ర సమరయోధుడు, సిపిఎం మొదటి జాతీయ ప్రధాన కార్యదర్శి పుచ్చలపల్లి సుందరయ్య 38 వ వర్ధంతి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. రెడ్డిగూడెం సిపిఎం మండల కార్యాలయంలో మండల కార్యదర్శి జంగా వెంకటరెడ్డి జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం సీనియర్ నాయకులు ఉయ్యూరు కృష్ణారెడ్డి సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మద్దిరెడ్డి మాధవరెడ్డి మాట్లాడుతూ ... సుందరయ్య జీవితం ఆదర్శనీయమైనదని, నిజాయితీ ఉన్న రాజకీయ నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు కొండపల్లి పరమేశ్వరరావు, శాఖా కార్యదర్శి అప్పిరెడ్డి, బాబు, తదితరులు పాల్గొన్నారు.










