ప్రజాశక్తి-పెడన : అమరావతి రాజధాని రైతులు చేస్తున్న అమరావతి నుండి అరసవల్లి వరకు 2వ విడత మహాపాదయాత్ర పెడన పట్టణానికి చేరుకున్న సందర్భంగా సిపిఎం నాయకులు అమరావతి రైతుల మహా పాదయాత్రలో పాల్గొని స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కర్చీపులను పంపిణీ చేశారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు పెడన నియోజవర్గంలోకి ప్రవేశించి హర్ష కాలేజీ వద్ద నుండి ప్రారంభమైంది. హర్ష జూనియర్ కాలేజ్ వద్ద నుండి ఉదయం అమరావతి రైతుల మహాపాదయాత్రలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు, కాగిత అభిమానులు, అఖిలపక్ష శ్రేణులు, నాయకులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పెడన నియోజకవర్గ ఇన్చార్జ్ కాగిత కృష్ణ ప్రసాద్ కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో పెడన పట్నానికి నాలుగు మండలాల నుండి పెద్ద ఎత్తున ఉప్పెనెల ఉప్పొంగింది రైతు పాదయాత్ర. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు బొడ్డు పద్మజాకుమారి, మాజీ ఎంపీ కొనగల నారాయణరావు, బూరగడ్డ వేద వ్యాస్, పట్టణ అధ్యక్షులు ఎక్కడ శ్యామలయ్య, కార్యదర్శి వాహబ్ ఖాన్ కమ్మగంటి వెంకటేశ్వరరావు బాబు పర్స జితేంద్ర దాదా వెలిగట్ల ప్రసాద్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ వీణం శ్రీనివాస్రావ్ కల్లిల్ భాష అనుమల పూర్ణ కూరుషుత్ బేగం అనంతరం. పెడన పెట్రోల్ బంక్, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా, బంటుమిల్లి రోడ్ సెంటర్ నుండి కొంకేపూడి, నడుపూరు మీదుగా గుడ్లవల్లేరు మండలం రెడ్డి పాలెంకు చేరుకుంది.










