Sep 12,2022 17:07
  • ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం కృష్ణా జిల్లా కమిటీ డిమాండ్

ప్రజాశక్తి కలక్టరేట్ (కృష్ణా) : నూతన ఎక్సైజ్ పాలసీ లో కల్లూగీత వృత్తి కి రక్షణ  కల్పించాలని  డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం కృష్ణా జిల్లా కమిటి ఆధ్వర్యంలో సోమవారం కలక్టరేట్ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వాకా రామచంద్రరావు మాట్లాడుతూ అక్టోబర్ నుండి అమలు కానున్న నూతన ఎక్సయిస్ పాలసీ లో కల్లూగీత వృత్తి కి రక్షణ కల్పిస్తూ, వృత్తి ని ఆధునీకరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లక్షలాదిమంది గీత కార్మికులు తమ వృత్తిలో స్వయం ఉపాధి పొందుతున్నరన్నారు. బహుళజాతి లిక్కర్ కంపెనీల, శీతలపానీయాల దాటికి కల్లు అమ్మకాలు దెబ్బతింటున్నాయని దీంతో వృత్తిలో ఉపాధి సరిగాలేక బతుకు దెరువుకోసం విదేశాలకు, నగరాలకు, పట్టణాలకు వలస బాట పడుతున్నరాన్నారు .కాబట్టి వృత్తిలో నైపుణ్యతను, ఉపాధి అవకాశాలను పెంచేలా కొత్త ఎక్సైజు పాలసీ  రూపొందించాలని డిమాండ్ చేశారు. అలాగే నవరాత్నాలలో కల్లు గీత కార్మికులకు కూడా అవకాశం కల్పించాలన్నారు. కల్లు గీత కార్పొరేషన్ కు నిధులు కేటాయించి కార్మికుల సంక్షేమం కోసం పని చేయించాలన్నారు.ప్రమాదవశత్తు చెట్ల పై నుండి పడిపోయిన వారికీ  ఎక్సైజ్ శాఖా నుండి నష్టపరిహారం యివ్వాలని డిమాండ్ చేశారు. కల్లుగీత కార్పోరేషను 5వేల కోట్లు నిధులు కేటాయించి గీత కార్మికుల సంక్షేమం కోసం పనిచేయించాలన్నారు. గీత కార్మికుల సంక్షేమం కోసం బడ్జెట్ రూ 100 కోట్లు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కల్లుగీత వృత్తిని ఆధునీకరించాలన్నారు. రకరకాల మద్యం బ్రాండ్లు ఉన్నట్లుగా ప్రకృతి ప్రసాదం అయిన కల్లుకు బ్రాండు కేటాయించి గీతవృత్తిని పరిశ్రమగా గుర్తించాలన్నారు. కల్లులోని పోషకాలపై ప్రభుత్వమే ప్రచారం చేసి మార్కెట్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. గీతవృత్తిలో ఎక్కడా ప్రమాదానికి గురై చనిపోయిన కటుంబానికి, శాస్వత వికళాంగులైన కుటుంబానికి రూ 10లక్షలు ఎక్స్ గ్రేషియో ఇవ్వాలనీ, తాత్కాలిక విళళాంగులకు రూ.1లక్ష చొప్పున ఇవ్వాలన్నారు. చనిపోయిన వారి కుటుంబానికి దహణ సంస్కారాలకు రూ.25వేలు, గాయపడినవారికి వైద్య ఖర్చుల సమిత్తం రూ.15 వేలు గీత కార్పోరేషన్ నుండి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాలకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పామర్తి వెంకటేశ్వరరావు, పరసా శ్రీను, మురాల నరసింహారావు, పామర్తి శ్రీనివాసరావు, వీరంకి వెంకటేశ్వరరావు, నారగని శ్రీనివాసరావు, ఏకుల స్వాములు, కొనకళ్ళ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.