ప్రజాశక్తి-పెడన : ఈనెల 24వ తేదీ విజయవాడ జింఖానా గ్రౌండ్లో సిపిఎం ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ బహిరంగ సభకు జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరవుతున్నారు. బిజెపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా విజయవాడలో ఈ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతున్నది. కావున ప్రజలందరూ 24వ తేదీ 10 గంటలకు విజయవాడ రావలసిందిగా సిపిఎం పెడన పట్టణ కమిటీ విజ్ఞప్తి చేసింది.










